Take a fresh look at your lifestyle.

ఆయిల్‌ ‌సాగు… భలే బాగు బాగు…

  • అయిల్‌ ‌పామ్‌ ‌కేంద్రంగా సిద్ధిపేట జిల్లాను ఎంపిక చేసిన కేంద్రం
  • పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ సిద్ధిపేట నియోజకవర్గంలోనే
  • రేపు పామ్‌ ఆయిల్‌ ‌సాగుపై రైతుల క్షేత్రస్థాయి పర్యటన
  • మొదటి దశలో 3500 ఎకరాలకు  సాగుకు అవకాశం
  • రైతులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్‌రావు టెలీకాన్ఫరెన్స్
  • ఏం..‌వెంకటయ్య ఎన్ని ఎకరాలు ఏస్తున్నవ్‌..అం‌టూ ఆత్మీయ పలకరింపు

ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు చేస్తే రైతుకు ఆర్థికంగా  ఎంతో ప్రయోజనం చేకూరుతుందనీ, అందుకు గానూ  ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు చేయాలని ఆసక్తిగా ఉన్న రైతులు అశ్వారావుపేటకు వెళ్లి విధానాన్ని తెలుసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు రైతులను కోరారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు, సాగు చేసే పద్దతి తెలుసుకునేందుకు ఈ నెల 2న అశ్వారావుపేట సందర్శన చేయాలన్నారు.  ఈ విషయమై నియోజకవర్గంలోని 150 మంది రైతులు, 150మంది ప్రజాప్రతినిధులు కలిసి మొత్తంగా 300 మందితో  మంత్రి హరీష్‌రావు బుధవారం టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా  మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుపై ఇటీవల సిద్దిపేట జిల్లా కేంద్రంలో  రైతులకు జిల్లా స్థాయిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు,  సిద్దిపేట జిల్లా ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు అనువైన ప్రాంతం అని కేంద్ర ప్రభుత్వ ఎంపిక చేసిందని మంత్రి చెప్పారు.

అదేవిధంగా తెలంగాణ  ప్రభుత్వం ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగును ప్రోత్సాహిస్తుందనీ, ఆదిశగా జిల్లాలో ప్యాక్టరీని ఏర్పాటు చేస్తుందన్నారు.  ఆ ప్యాక్టరి  సిద్దిపేట నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఈ ఆయిల్‌ ‌పామ్‌తో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనీ, ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందన్నారు.  క్షేత్ర సందర్శనలో అశ్వారావుపేటలోని పామాయిల్‌ ‌నర్సరీని, పామాయిల్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్‌తోపాటు  దమ్మపేటలో రైతుల  క్షేత్రాన్ని సందర్శించి అక్కడి రైతులతో వారి అనుభవాలను తెలుసుకోవాలన్రా. అలాగే, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని  పశ్చిమగోదావరి జిల్లాలోని పడవేగిలో గల ఆయిల్ఫామ్‌  ‌రీసెర్చ్ ‌సెంటర్‌ను సందర్శించి అక్కడి  శాస్త్రవేత్తలతో  మాట్లాడాలని కోరారు. కొరోనా నేపథ్యంలో విడతలవారీగా అన్ని నియోజకవర్గాల నుంచి రైతులను అశ్వరావుపేట జిల్లాకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఆయిల్‌ ‌ఫెడ్‌ ‌కార్పొరేషన్‌, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ క్షేత్ర సందర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వెంకటయ్య ఎన్ని ఎకరాలు ఏస్తున్నవ్‌..
ఏం ‌వెంకటయ్య ఎన్ని ఎకరాలు ఏస్తవ్‌..  ఆశ్వారావుపేటకు పోతున్నవా. సాగు చేయు లాభం ఉంటుందని మంత్రి హరీష్‌ ‌రావు  ఇబ్రహీంనగర్‌ ‌గ్రామానికి చెందిన రైతుతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. అదేవిధంగా చిన్నకోడూర్‌ ‌మండల కేంద్రానికి చెందిన రైతు రాజేశ్వర్‌రావుతో మాట్లాడారు. ఆయనేమో 4 ఎకరాలు ఏస్తాం  సార్‌.. ‌మీరు ఫోన్‌లో చెప్పిన అంశాలు బాగా అనిపించాయి సార్‌. ‌చాలా బాగా చెప్పారు. మేము అశ్వరావుపేటకు వెళ్లి చూసి వచ్చి పామ్‌ ‌సాగు చేసుకుంటాం అని హరీష్‌రావుతో అన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ  అందుకు మీకు ఏ సహకారమైనా, ఏం  కావాలన్నా కూడా సంబంధిత ధికారులు, గ్రామ సర్పంచి మీకు అందుబాటులో ఉంటారన్నారు. వచ్చే వానాకాలంలో మొదట దశ లో జిల్లాలో 3500 ఎకరాలకు సాగు చేసుకొనే అవకాశం ఉందనీ, జిల్లాలోని ఆసక్తి గల రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆయిల్‌ ‌ఫెడ్‌ ‌చైర్మన్‌ ‌సురేందర్‌ ‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌, ‌హార్టీకల్చర్‌ అధికారిణి రామలక్ష్మీ, ఇండస్ట్రీయల్‌ ‌మేనేజర్‌ ‌శివప్రసాద్‌, ‌సిద్దిపేట నియోజకవర్గంలోని  5 మండలాల జడ్పిటిసిలు, ఎంపిపిలు, సూడా చైర్మన్‌,  ‌మార్కెట్‌ ‌కమిటీ, పిఎసిఎస్‌ ‌ఛైర్మన్లు, ఆత్మకమిటీ• చైర్మన్‌, ‌రైతు బంధు అధ్యక్షులు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Leave a Reply