Take a fresh look at your lifestyle.

హరితహారంపై అధికారులు దృష్టి సారించాలి

నాటిన ప్రతి మొక్కను జియో టాకింగ్‌ ‌చేయాలి : సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌. ‌వెంకటరావు 

మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 05 (‌ప్రజాతంత్ర ప్రతినిధి) : హరితహారం కార్యక్రమం పై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌వెంకటరావు ఆదేశించారు. ఈ సంవత్సరం హరితహా రం కింద నాటే ప్రతి మొక్కను జియో ట్యాగింగ్‌ ‌చేయాల్సిందేనని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను జిల్లా అధికారులు ముందుండి నడిపించాలని సూచించారు.శుక్రవారం జిల్లా పరిషత్‌ ‌సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమం పై జిల్లా కలెక్టర్‌ ‌జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమం లో భాగంగా జిల్లాలో కోటి మొక్కలు నాటాలన్నదే లక్ష్యమని కలెక్టర్‌ అన్నారు. అందువల్ల జిల్లా అధికారులు అందరూ ఈ అంశాన్ని ప్రత్యేక దృష్టితో తీసుకోవాలని చెప్పారు. పంచాయతీ రాజ్‌, ఆర్‌ అం‌డ్‌ ‌బి రహదారుల వెంట పెద్ద మొక్కలు నాటాలని అన్నారు. ఒకవేళ ఇదివరకే ఒక వరుస మొక్కలు నాటి నట్లయితే రెండు వరుసలో మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. ఈవిడత ప్రతి రైతుకు 10 మొక్కల ను ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన మొక్కలను వ్యవసాయ శాఖకు అప్పగిస్తామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను మూడు రోజుల్లో పూర్తి చేయాలని వ్యవ సాయ అధికారిని సచరితను ఆదేశించారు జిల్లాలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చీలలో మొక్కలు నాటాలని, ముఖ్యంగా దేవాలయాలలో బ్లాక్‌ ‌ప్లాంటేష న్‌ ‌చేపట్టాలని తెలిపారు. ఎక్సైజ్‌ ‌శాఖ ద్వారా ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూములన్నిటిలో మొక్కలు నాటాలని అన్నారు. హార్టికల్చర్‌ ‌ద్వారా పది లక్షల మొక్కలు, రెవెన్యూ శాఖ ద్వారా ఐదు లక్షలు, ఐకేపీ ద్వారా 8.90 లక్షలు మొక్కలు నాటాలని అన్ని శాఖల అధికారులు మండలాల వారీగా మొక్కలు నాటే సైట్లు ఆయా సైట్ల లో ఎన్ని మొక్కలు నాటుతున్నది, అలాగే ఎలాంటి మొక్కలు నాటుతున్నది, గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమో తెలియజేస్తూ ప్రణాళిక తో సమర్పించడం తో పాటు ప్రణాళికపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.జిల్లాలో పంచాయతీ రాజ్‌, ‌రహదారులు భవనాల రహదారుల పక్కన నాటేందుకు అవకాశం ఉందని, పెద్ద రహదారులు అయితే డబుల్‌ ‌లైన్లో మొ క్కలు నాటాలని, అదేవిధంగా ఇరిగేషన్‌ ‌శాఖ ద్వారా అన్ని చెరువుల వద్ద 2 .47 లక్షల మొక్కలు నాటాలని ఆదేశించారు.

ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేనట్లయితే మొక్కలు పెంచేందుకు మొక్కల సంరక్షణ కు ఒక వాచర్‌ ‌న్‌ ‌నియమించుకోవాలని ఆయన సూచించారు. ఆర్టీసీ బస్టాండ్‌లలో, పాఠశాలలు, మార్కెట్‌ ‌గోదాములు ,డిగ్రీ కళాశాలలు ప్రైవేట్‌ ‌కళాశా లలు కళాశాలలు ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హౌసింగ్‌ ‌కాలనీ లో, అంగన్వాడి కేంద్రాలు, పరిశ్రమ లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆయన ఆదేశిం చారు .అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ ‌కళాశాలలు పాఠశా లలు, చౌక ధరల దుకాణాలు లో కూడా మొక్కలు నాటాలని కలెక్టర్‌ ‌చెప్పారు. అన్ని మున్సిపాలిటీలలో మొక్కలు నాటేందుకు మున్సిపల్‌ ‌కమిషనర్లు ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. మండలాలు లేదా మున్సిపాలిటీలలో మొక్కలు కొనుగోలు చేయవలసి వస్తే తప్పనిసరిగా 20వేల మొక్కల వరకు మండల స్థాయిలో మండల స్థాయి గ్రీన్‌ ‌కమిటీ ఆమోదం తప్పనిసరిగా పొందాలని, 20వేలు దాటితే తన అను మతితో మొక్కలు కొనుగోలు చేయాలని ఆయన సూచిం చారు జిల్లా అధికారి ప్రతి ఒక్కరు మొక్కలు ఎక్కడ నాటింది ప్రత్యక్షంగా వెళ్లి చూడడంతో పాటు వాట్సాప్‌ ‌లో ఫోటోలు అప్లోడ్‌ ‌చేయాలని, అంతేకాక ప్రతి మొక్క కు తప్పనిసరిగా జీయో టాగింగ్‌ ‌చేయాలని అని తెలిపారు. ఈ విడత జియో టాగింగ్‌ ‌చేయని మొక్కలను పరిగణలోకి తీసుకోవటం జరగదని ఆయన స్పష్టం చేశారు.మొక్కల సంరక్షణ బాధ్యత కోసం ఒక ఇన్చార్జి అధికారిని నియమించాలని కలెక్టర్‌ ‌సమీక్షిస్తూ ప్రభు త్వ శాఖలకు సంబంధించి పథకాలపై ఆయా శాఖల అధికారులు పక్షం రోజులకు ఒకసారి సమీక్ష సమావే శాలు నిర్వహించాలని, మొదటి సమావేశం ప్రతి నెల 15, 16 తేదీలలో రెండో సమావేశాన్ని 1,2 తేదీలలో ఏర్పాటు చేసుకొని సమీక్ష నిర్వహించాలని తెలిపారు .ప్రభుత్వ కార్యక్రమాల పై ముందుగా దృష్టి నిలపాలని అన్నారు. మండల ,డివిజన్‌ ‌స్థాయి అధికారులు, సిబ్బందిపై జిల్లా అధికారులకు పూర్తి నియంత్రణ ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ గైర్హాజరు కాకుండా చూసుకోవాలని అన్నారు. రెండు మూడు నెలలు సీజనల్‌ ‌వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వీటిని అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ముఖ్యం గా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో మున్సిపాలిటీలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు ఖచ్చితంగా అవార్డులలో పర్యటించాలని, అదేవిధంగా మండల ప్రత్యేక అధికారి కూడా గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. రాష్ట్ర మున్సిపల్‌ ,ఐటీ శాఖ మంత్రి కెటి ఆర్‌ ఆదేశాల మేరకు ఆదివారం పది గంటలకి పదినిమిషాల కార్యక్రమాన్ని నిర్వహించాలని, అన్ని కార్యాలయాలు,ఇళ్లల్లో నీటిని పారబోసి తిరిగి పట్టుకు నేలా ఇల్లిల్లు తిరగాలని ఆయన చెప్పారు. అదనపు కలెక్టర్లు సీతారామారావు, మోహన్‌ ‌లాల్‌ ,‌డి ఎఫ్‌ఓ ‌గంగారెడ్డి, డిఆర్డిఓ వెంకట్‌ ‌రెడ్డి ,జడ్పీ సీఈఓ యాద య్య, ఆర్డిఓ శ్రీనివాస్‌, అధికారులు హాజరయ్యారు.

Leave a Reply