Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ విధానాలే .. విద్యారంగానికి మరణ శాసనాలు

నేడు హైదరాబాద్‌లో ఉపాధ్యాయ సంఘాల మహాధర్నా 

దేశంలో, రాష్ట్రంలో చాలా కాలంగా కామన్‌ ‌స్కూలు డిమాండ్‌ ఉం‌ది. కానీ పాలకులు ఈ డిమాండ్‌ ‌ను ఆ విధాన స్వాప్నికుల ఊతపదంగా భావిస్తున్నారు. ఒకే పాఠశాల విధానం కలగానే మిగిలి, పాతపడిపోయింది. ప్రగతిశీల, సమతా వాదుల కామన్‌ ‌స్కూల్‌ ‌డిమాండ్‌ ఎం‌త బలంగా ఉండేదో(ఉందో) అంతే బలంగా వివిధ దొంతరల, అనేక యాజమాన్యాల పాఠశాలల వ్యవస్థ అమలవుతూ వచ్చింది. గుత్త పెట్టుబడికి సువర్ణధ్యాయంగా ఉన్న ప్రస్తుత కాలంలో కార్పొరేట్‌ ‌శక్తులు మొత్తం విద్యా వ్యవస్థను కబళించేందుకు బలమైన పునాదులు నిర్మించుకున్నాయి. దేశంలోకి ప్రవేశిస్తున్న విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఆ కోవకు చెందినవే. కొన్ని వర్గాలకే విద్యను పరిమితం చేసిన వేదకాలం నాటి బ్రాహ్మణీయ విద్యా విధానాలు ఇప్పుడు కార్పోరేట్‌ ‌రూపంలో ముందుకు వస్తున్నాయి. సంపన్నులకు, ఉన్నతాదాయా వర్గాలకు మాత్రమే విద్య అందుబాటులో ఉండి, 80% మంది పేద, మధ్యతరగతి వర్గాలకు, దళిత గిరిజనులకు పూర్తిగా దూరం కానున్నది. సామాజిక, రాజకీయ,ఆర్థిక, సాంస్కృతిక అసమానతలను పెంచి ఆధిపత్య వర్గాలకు ఆలంబనగా నిలిచిన నాటి విద్యా విధానానికి, అవే అసమానతలను తిరిగి ప్రేరేపిస్తూ అదే ఆధిపత్య వర్గాలకే అందుబాటులో వుండనున్న కార్పొరేట్‌ ‌విద్యకు ఒక్కటి మినహా తేడా ఏమి లేదు. మనువాద వర్ణ వ్యవస్థకు అదనంగా లాభార్జన కొరకు పెట్టుబడి తోడవ్వడమే ఆ తేడా. మనువాదం, బ్రిటీష్‌ ‌వలస వాదం,పెట్టుబడిల మిశ్రమమే నేటి విద్యావిధానం. మెఖాలే గుమస్తా విధానం లాగే ప్రస్తుత మార్కెట్‌ అవసరాలకు తగిన మానవ వనరులను సృష్టించడం, డిజిటలైజేషన్‌, ‌సంస్కృత భాషకు ప్రాధాన్యం అంటూ చీజు• లో పొందుపరిచిన అంశాలు దీనిని రూఢీ పరుస్తున్నాయి. ఇది దేశ విద్యా, సామాజిక, సాంస్కృతిక రంగాలలో తిరోగమన ప్రయాణం తప్ప మరొకటి కాదు. ఒకే దేశం లో ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే జెండా, ఒకే మతం, ఒకే మార్కెట్‌, ఒకే ఎన్నిక (జమిలి), ఒకే సిలబస్‌ అం‌టున్న (వి)దేశీ భక్తుల పాలనలో ఒకే దేశం – ఒకే పాఠశాల విధానం మాత్రం రూపుదిద్దుకోలేదు. వారికి కావాల్సింది ఒకే సిలబస్‌ ‌తప్ప ఒకే పాఠశాల విధానం కాదని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా స్పష్టమైంది. శాస్త్రీయ దృక్పథాలను వెనక్కినెట్టి విద్య యొక్క సారాన్ని కాషాయమయం చేయగలిగిన శక్తి పాఠ్యపుస్తకాలకు (సిల్లబస్‌) ఉం‌టుందని కాషాయ భక్తులకు బాగా తెలుసు. అందుకే దేశవ్యాప్తంగా ఒకే సిల్లబస్‌ ‌ను ప్రతిపాదిస్తున్నారు. సామాజిక, ఆర్థిక  అసమానతలను రూపుమాపగల ఒకే పాఠశాల మాత్రం వారి విధానాల్లో ఎప్పటికైనా భాగమవుతుందనే నమ్మకం లేదు. దేశంలో విభిన్న అసమానతలను అంతం చేయగల ఒకే స్కూల్‌ ‌వ్యవస్థను విస్మరించి, విభిన్న సంస్కృతులను ధ్వంసం చేయనున్న ఒకే సిల్లబస్‌ ‌ను మాత్రం అమలు చేయ సంకల్పించారు. అలాగే ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన తప్పనిసరి చేస్తూ, ఈ నిబంధన ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయడం వెనుకగల ఉద్దేశ్యమూ సుస్పష్టం. ప్రపంచమంతా ఒకే దేశం (ప్రపంచీకరణ) గా మార్చిన  క్రమంలో ఆంగ్లభాష ప్రాధాన్యతను సంతరించుకుంది. కనీసం రాష్ట్రాల్లో దేశాల్లో పాలనా వ్యవహారాలు సైతం మాతృభాషలో నడపకుండా ఆర్థికంగా పేద, మధ్యతరగతి వర్గాలు, సామాజికంగా దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల పిల్లలకే మాతృభాషను తప్పనిసరి చేయడం ఆయా వర్గాలను విద్యలో, ఉద్యోగాల్లో అవకాశాల్లో, పోటీల్లో వెనక్కినెట్టే కుట్ర తప్ప మాతృభాష పై ప్రేమ అయితే కాదు.

- Advertisement -

అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగానికి ఏ విధమైన ప్రాధాన్యత లేకుండా పోయింది.  బడ్జెట్‌ ‌కేటాయింపులలో, పర్యవేక్షణలో, సమస్యల పరిష్కారంలో పూర్తిగా విస్మరించబడింది. అదే సమయంలో విద్యా వ్యాపారంలో మాత్రం దూసుకపోతూ మిగతా రాష్ట్రాలను వెనక్కి నెడుతుంది. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య వాగ్దానాన్ని ప్రైవేట్‌ ‌విశ్వవిద్యాలయాలు అక్రమించుకుంటున్నాయి. కుల, మత, ఆర్థిక తేడాలు లేకుండా కలెక్టర్‌ ‌నుంచి చెప్రాసి పిల్లలకు ఒకే పాఠశాల, సమాన విద్య హామీ స్థానంలో కులానికొక గురుకులం, మతానికో సొసైటీ ఏర్పడి నిచ్చెనమెట్ల కుల వర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాయి. మూడు కమ్మల్లో  మూడు రోజుల్లో సర్వీస్‌ ‌నిబంధనల వాగ్దానానికి 6 సంవత్సరాలు అంటే 2190 రోజుల వయసొచ్చినా పెరుగుదల(పని)లో మాత్రం మరుగుజ్జుదైపోయింది. ఉపాధ్యాయులకు చూపిన దేశంలోనే అత్యున్నత వేతనాల ఆశలన్నీ ఎప్పుడో నిరాశలో కొట్టుకుపోయాయి. న్యాయంగా రావాల్సిన కరువు భత్యం, హక్కుగా పొందాల్సిన ఒకటో తేదీన వేతనాల కోసం కూడా దీనంగా ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆసరా పథకానికన్నా బ్రతుకు భరోసాను హీనం చేసిన నూతన పెన్షన్‌ ‌విధానం (•••) ప్రభుత్వం దృష్టిలో ఉద్యోగ ఉపాధ్యాయులకు వరం లా తోస్తుంది. ఒక్క పైసా ఆర్థిక ప్రయోజనం లేకుండా జారీ చేసిన పేరు మార్పిడి అప్గ్రేడెడ్‌ ఉత్తర్వులు పండిట్‌, ‌పి.ఇ.టి లను రెండు సంవత్సరాలుగా అవమానిస్తూనే ఉన్నాయి. పైసా ఖర్చు కూడా భారం పడకుండా నిర్వహించగలిగిన సాధారణ, అంతరజిల్లా బదిలీల దస్త్రం ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

తెలంగాణ లో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరన్న ఉటంకింపును ఖ+దీ• మహిళా ఉపాధ్యాయుల వెట్టిచాకిరి వెక్కిరిస్తూ ఉంది. నెల రోజుల్లో వేతన సవరణ హామీ ఏ నెలలో, ఏ సంవత్సరం లోనో స్పష్టత లేక సాగిపోతూనే ఉంది. •=• అమలు వల్ల ప్రభుత్వం మీద పడే ఆర్థిక భారాలను ఎప్పటికప్పుడు లెక్కించి అచ్చు వేస్తూ ప్రభుభక్తిలో పోటీపడుతున్న బాధ్యతాయుత వార్తా పత్రికలు ఇప్పటికీ 30 నెలల్లో( జూలై 2018 నుండి) 30 కంటే ఎక్కువ సార్లు ఆ పనిని చేసి ఉన్నాయి. ప్రభుత్వం కంటే ముందే ఉద్యోగ ఉపాధ్యాయులకు రెట్టింపు జీతాలు, డబుల్‌ ‌ధమాకా, జీతాల జాతరలు నిర్వహించివున్నాయి. తద్వారా •=• అమలును డిమాండ్‌ ‌చేయడానికే భయపడే పరిస్థితి సృష్టించాయి. నిరుద్యోగులకు వుండే ఆరోగ్య శ్రీ కానీ, ఉద్యోగులకు వుండే ఆరోగ్య కార్డు పథకం లేదా మెడికల్‌ ‌రీ ఇంబెర్సెమెంట్‌ ‌గానీ వర్తించకుండా, ఆరోగ్య రక్షణ లేక తాము ఉద్యోగులమో, నిరుద్యోగులమో తమకే తెలియని దిక్కుతోచని స్థితి ఖ+దీ•, గురుకుల, మోడల్‌ ‌స్కూల్‌ ‌సిబ్బందికి ఉంది. ఇలాంటి సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలిన ప్రభుత్వం ప్రజా పాఠశాలల గొంతు కోయడానికి పదునైన కత్తులను సిద్ధం చేసుకుని అదును కోసం ఎదురుచూస్తుంది. హేతుబద్దీకరణ, పని సర్దుబాటు, పాఠశాలల కుదింపు, ఖ••ల రద్దు వంటి ప్రయత్నాలన్నీ అందులో భాగమే. అలాగే వీజు• లు లేకుండా ఒక్కొక్కరికి 5, 6 మండలాల బాధ్యతలు అప్పగించి పర్యవేక్షణను నీరుగార్చి పాఠశాలలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. ఇప్పటికే ఉప విద్యాశాఖాధికారుల పోస్టులు రద్దు చేసి ఉన్నత పాఠశాలలకు అదే దారి చూపెట్టారు. ప్రజా పాఠశాలలు కొనసాగడమే ఇష్టం లేని ప్రభుత్వాలు ఒకవైపు కార్పొరేట్‌ ‌ప్రోత్సాహక, ఇంకోవైపు స్వయం మరణానికి గురి చేసే విధానాలను ఏక కాలంలో అమలు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ప్రోదవ్వకుండా ఉపాధ్యాయుల పట్ల, పాఠశాలల పట్ల ఏహ్యభావాన్ని పెంచుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు స్వరాష్ట్రంలోనూ పోరుదారిలో నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ఉద్యమాల అవసరమే ఉండదన్న పాలన నియంతృత్వంలా మారి అణచివేత మార్గంలో ప్రయాణిస్తుంది. నిర్బందాలను అధిగమించి ఉపాధ్యాయుల పట్ల బాధ్యతాయుత సంఘాలు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (ఖ•••), ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జీ••••) గా ఏర్పడి ఉద్యమించిన ఫలితంగా 16 మే 2018 న సంఘ నాయకులతో సుదీర్ఘంగా చర్చించి ముఖ్యమంత్రి ఇచ్చిన లిఖితపూర్వక హామీల్లో నేటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అయినా ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్న అనుభవంతో, ఎందరో నియంతల మెడలు వంచిన చరిత్ర స్పూర్తితో ఉద్యమ సంఘాలు పోరాట మార్గాన సాగుతున్నాయి. ఏక కాలంలో అటు కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేట్‌ ‌విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నాయి. విద్యా కాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కేంద్రంతో, పరోక్షంగా అవే విధానాలను అవలంభిస్తూ విద్యా రంగ సమస్యలను పెంచి పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. ఉద్యమాలను నీరుగార్చడానికి ప్రభుత్వ భజన సంఘ నాయకుల అబద్ధాలను, కుతంత్రాలను ఎదిరిస్తూ కార్యకర్తలను లక్ష్యం వైపుగా తరలించడం నాయకత్వాల ప్రథమ కర్తవ్యంగా మారింది. కొన్ని సమస్యలను మాత్రమే ప్రభుత్వం ముందు ఉంచి యు.ఎస్‌. ‌పి. సి, జాక్టో లలోని 32 సంఘాల ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్కు, హైదరాబాద్‌ ‌వద్ద జరుగుతున్న మహాధర్నా అంతిమ లక్ష్యం మాత్రం విద్యారంగ పరిరక్షణే.

Leave a Reply