Take a fresh look at your lifestyle.

41 ఏళ్ల కల ఫలించిన వేళ

భారత హాకీ కల సాకారం లో ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌ ‌పాత్ర

ఒలింపిక్స్‌లో భారత హాకీ ప్రయాణం వరసగా 6 గోల్స్ ‌మెడల్స్‌తో స్వర్ణయుగం నుంచి పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణ టోక్యో ఒలంపిక్స్ ‌లో ఫలించింది.టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జరిగిన కాంస్య పతక పోరులో టీమ్‌ ఇం‌డియా హాకీ జట్టు జర్మనీతో జరిగిన మ్యాచ్లో 5-4 గోల్స్ ‌తేడాతో గెలిచి కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది. భారత మహిళల మరియు పురుషుల హాకీ జట్టులో సెమీఫైనల్‌ ‌దశ వరకు చేరుకోవడంలో ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌ ‌పాత్ర ఎంతగానో ఉంది. 2018 నుంచి రెండు జట్లకు స్పాన్సర్‌ ‌గా వ్యవహరిస్తూ 150 కోట్ల రూపాయలకు పైగా ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.

1928 నుంచి 1956 వరకు ఆరుసార్లు వరుస ఒలింపిక్స్లో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించింది టీమ్‌ ఇం‌డియా. 1960లో రజతం సాధించింది. మళ్లీ 1980లో స్వర్ణంతో మెరిసింది. కానీ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. ఈసారి మంచి అంచనాలతో బరిలో దిగిన మన్ప్రీత్‌ ‌సేన అదరగొట్టింది. సెమీస్లో బెల్జియం చేతిలో ఓడినా.. కాంస్య పతక పోరులో జర్మనీపై గెలిచి పతకం ఖాయం చేసుకుంది.మొత్తంగా ఒలింపిక్స్లో భారత్కు ఇది 12వ పతకం. మాస్కో విశ్వక్రీడల తర్వాత తొలి పతకం.12 పతకాలతో ఒలింపిక్‌ ‌హాకీలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది.భారత హాకీ పునరుజ్జీవానికి,పునర్వైభవానికి కారకుడు.. ఒడిస్సా ముఖ్యమంత్రి శ్రీ నవీన్‌ ‌పట్నాయక్‌ఒడిస్సా సిఎం నవీన్‌ ‌పట్నాయక్‌ ‌నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం 2018 నుండి భారత పురుషులు, మహిళల భారత హాకీ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఒడిశా 2018 లో హాకీ వరల్డ్ ‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది.ఇప్పుడు ఒడిశా హాకీ వరల్డ్ ‌కప్‌ 2023 ‌కోసం రూర్కెలా ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని నిర్మిస్తోంది.ఇలా ప్రతి రాష్ట్రం ఏదో ఒక క్రీడకి స్పాన్సర్‌ ‌గా వ్యవహరిస్తేవచ్చే ఒలింపిక్స్ ‌లో పతకాల పంట పండడం ఖాయం. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలంపిక్స్ ‌లో పతకం సాధించిన భారత హాకీ జట్టు ముందు ముందు మరింత పట్టుదలతో బంగారు పతకాలు తెచ్చి పునర్వైభవం సాధిస్తుందని ఆశిద్దాం.
– పిన్నింటి బాలాజీ రావు ,హనుమకొండ
9866776286

Leave a Reply