Take a fresh look at your lifestyle.

జీవన నావకు చుక్కాని

(05 అక్టోబర్‌ ‘‌ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ సందర్భంగా)
మేధో మహావృక్షం గురువు
విజ్ఞాన నీడను పంచే
విశ్వాసం నింపే చెలిమె
తడబడినపుడు ఊతకర్ర !

కనిపించే దైవరూపం
నీడలా రక్షించే శక్తిరూపం
విజ్ఞాన వనరుల కేంద్రం
ఎదుగుదలలో ఉత్ప్రేరకం !

శాస్త్రసాంకేతిక నైపుణ్య నిధి
వ్యక్తిత్వ వికాస పునాది
శ్రేయస్సును కోరే పెన్నిధి
విజ్ఞాన వివేకాల సన్నిధి !

నవ యువ తరాల నిర్మాత
సామాజిక చైతన్య గీతిక
విజ్ఞాన వితరణకే వెన్నెముక
జ్ఞాన విత్తులు నాటే కర్షకుడు !

శిలను శిల్పంగా చెక్కే శిల్పి
మదిని సుసంపన్నం చేసే నిధి
పువ్వుకు పరిమళమద్దే చేయి
జీవనోపాధి చూపే జ్ఞాని గురువే !

ఉన్నతిని కోరే ఊటబాయి
నీడలా రక్షించే గొడుగు
విజ్ఞానమే సంపదైన వివేకి
నిస్వార్థ లోక హితవరి !

జన దేవాలయ పూజారే కాదు..
జీవన సౌందర్య ప్రాణవాయువు
గురు ఉపదేశాలే దిశ నిర్దేశాలు
గురువు కదా జీవన నావకు చుక్కాని !

– మధుపాళీ, కరీంనగర్‌,9949700037

Leave a Reply