అక్టోబర్ 24 ఐరాస ఆవిర్భావ దినోత్సవం..
ప్రపంచ శాంతి స్థాపనలో ఐక్య రాజ్య సమితి పాత్ర చాలా కీలకం, మూడవ ప్రపంచ యుద్దం రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ శాంతి సంస్థను ఏర్పాటు చెయ్యలనే ఉద్దేశ్యంతో ఏర్పడినదే ఈ ఐక్యరాజ్యసమితి,1945 నుండి 2021 సంవత్సరాల మధ్య కాలంలో గల 76 సంవత్సరాల ఐరాస చరిత్రనే ఐక్యరాజ్యసమితి విజయానికి ఒక కారణం అని చెప్పవచ్చు . కానీ కొన్ని నిర్ణయాలలో ఐక్యరాజ్యసమితి సొంతంగా కఠిన నిర్ణయాలు తీసుకోకుండా కొంతవరకు అగ్రరాజ్యలు చెప్పిన విధంగా వ్యవహరిస్తుందనే విమర్శలు తీవ్రంగానే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం చాలా ప్రదేశాల మధ్య,చాలా దేశాల మధ్య సుదీర్ఘంగా ఉండే సమస్యలను తన చరిష్మాతో ఆ సమస్యల సాధనకు కృషి చేయ్యడం లేదనే విమర్శలు బలంగానే ఉన్నాయి.
1919 వర్సైల్స్ సంధి ద్వారా ప్రపంచ శాంతికి ఒక శాంతి సంస్థ కావాలని నిర్ణయించుకోని ఉడ్రోవిల్సన్ 14 వ సూత్రంలో భాగంగా నానాజాతిసమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నానాజాతి సమితి వైఫల్యం తర్వాత రెండవ ప్రపంచ యుద్దం వచ్చింది. మూడో ప్రపంచ యుద్దం రాకుండా అడ్డుకుని, ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా మరో అంతర్జాతీయ శాంతి సంస్థను ఏర్పాటు చేయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే 14 -ఆగస్ట్ -1941 లో అమెరికా అధ్యక్షులు ఎఫ్.డి రూజ్‌వేల్త్ , బ్రిటన్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ అట్లాంటిక్ మహసముద్రంలోని సూర్యపౌండ్ లాండ్ ఓడరేవులో శాంతి సంస్థ కావాలని ఒక రకంగా అంగీకారానికి వచ్చారు, ఆ తర్వాత ఐరాస ఏర్పాటు కోసం వివిధ రకాలుగా కొన్ని కీలకమైన సమావేశాలు జరిగాయి. అందులో మాస్కో సమావేశం (1943 ), టెహరాన్ సమావేశం (1943 ),డంబర్టన్ ఓక్స్ సమావేశం (1944 ),యల్టా సమావేశం (1945), ఐరాస ఏర్పాటుకు జరిగిన చిట్ట చివరి సమావేశం,ఇది ఐరాస ఏర్పాటుకు ఒక వెన్నముక్క లా నిలిచిన సమావేశం శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం (1945 ) కీలకమైనవి.
1945 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పుడు ఉన్న పరిస్థితి వేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి వేరు. 1945, 1950 సంవత్సరం వరకు కూడా బ్రిటన్,ఫ్రాన్స్ ల ఆధిపత్యం, విస్తరణవాదం ,సామ్రాజ్యవాదం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. కానీ అన్నిదేశాలు స్వాతంత్రం పొందిన తర్వాత ఆ రెండు దేశాల ప్రభావం క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది,అంతేకాదు నాడు ఆ దేశాలు బలమైన ఆర్థిక వ్యవస్ఠగా ఉండేవి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా మారిపోయింది. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితిని సైతం మార్చక తప్పదు.
సామ్రాజ్యవాదం,వలసవాదాలకు స్వస్తీ పలికి 20 వ శతాబ్దం చివరికల్లా ప్రపంచంలోని అన్ని దేశాలు స్వాతంత్రాని సంపాదించి ఆయా దేశాలలో స్వేచ్చ,సమానత్వం ఏర్పడి శాంతియుత,స్వయం పరిపాలన సాగాలనే లక్ష్యంగా ఐరాస పని చేసింది,కానీ 21 శతాబ్దంలోనే చైనా అనుసరిస్తున్న విస్తరణవాదం యావత్ ప్రపంచానికే ప్రమాదకరంగా మారింది. ఒకవైపు చైనామేం వేర్పాటు వాదానికి వ్యతిరేకం అని చెప్తూ విస్తరణవాదాని కొనసాగిస్తున్న ప్రపంచానికి ఒక కొరకరాని కొయ్యగా తయారయింది. చైనా దేశం చేసిన విస్తరణవాద ప్రకటనపై ఐరాస గట్టిగానే సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
భారత్ -పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు విషయంలో సరిహద్దు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రత్యేక ప్రయత్నాలు ఏవి లేవు. ప్రస్తుతం జమ్మూ • కాశ్మీర్ విషయంలో శాంతి స్థాపన ,ప్రశాంత వాతావరణాని తయారు చేసింది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వమే తప్ప ఐరాస పాత్ర ఏమాత్రం లేదని గుర్తించాలి. ప్రపంచంలో ఒక్క జమ్మూ • కాశ్మీర్ విషయమే కాదు, గత సంవత్సరం వరకు అర్మేనియా – అజార్ బైజన్ దేశాల మధ్య ఉన్నటువంటి నాగర్నో- ఖరబాత్ సరిహద్దు విషయంలో ఆ రెండు దేశాలే శాశ్వత పరిష్కారాని కనుకున్నాయే తప్ప ఈవిషయంలో ఐక్యరాజ్యసమితి పాత్ర నామమాత్రమే. ప్రస్తుతం తైవాన్ ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తుంది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి ఏ విధంగా వ్యవహారిస్తుందో వేచి చూడాలి, ఒకవేళ ఈ తైవాన్ విషయంలో ఐక్యరాజ్యసమితి పూర్తి స్థాయిలో చైనా దూకుడుకు కళ్ళెం వెయ్యలేకపోతే ఐక్యరాజ్యసమితి పతనానికి ఈ విషయం ఒక ప్రధాన భూమిక పోషించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
ఐక్యరాజ్యసమితి అగ్రరాజ్యాలు చెప్పిన విధంగా కాకుండా ప్రపంచ శాంతి స్థాపన కోసం సొంతంగా ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైన సిద్ధంగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలకు,ముఖ్యంగా అభివృద్ధి చెందని దేశాలకు ఐక్యరాజ్యసమితి ఉందనే భరోసా వారికి ఉంటుంది. ఆ విధంగా ఐక్యరాజ్యసమితి నిష్పక్షపాతంగ వ్యవహారించాలి.
ఐక్యరాజ్యసమితి సమితిలోని భద్రత మండలిలో ప్రస్తుతం ఉన్న ఐదు శాశ్వత సభ్య రాజ్యాలు అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్,రష్యా,చైనా ఉన్నాయి. వీటితో పాటు భద్రతమండలిలో శాశ్వత సభ్య రాజ్యాలుగా చెలామణి కావాలనే లక్ష్యంతో ఏర్పడిన +4 దేశాలు భారత్,జపాన్,జర్మనీ,బ్రెజిల్ చాలా కాలం నుండే ప్రయత్నం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఏర్పడిన 1945 నాటి పరిస్థితులను కాకుండా మారుతూన్న కాలానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితిని సైతం మార్చక తప్పదు. 1920 లో ఏర్పడిన నానాజాతిసమితి కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మారనందుకే ఆ సంస్థ విఫలమై రెండవ ప్రపంచ యుద్దానికి దారితీసింది. ఈ విషయాని,ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రాంతాల మధ్య,దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పాటు కావాలంటే ఐక్యరాజ్యసమితిని సవరించాల్సిందే . అప్పుడే ప్రపంచంలోని అనేక దేశాలకు ఐక్యరాజ్యసమితి మీద నమ్మకం,గౌరవం పెరుగుతుంది.
– కేతూరి శ్రీరామ్, ఎంఏ పొలిటికల్ సైన్స్,
ఉస్మానియా యూనివర్సిటీ.