Take a fresh look at your lifestyle.

వినియోగదారుల అవసరాలు తీర్చడంలో ప్రమాణాలు కీలకం

తయారు చేయబడే అన్ని వస్తువుల విషయంలో అనివార్యంగా పాటించవలసిన కొన్ని సాంకేతిక సూత్రాలు వుంటాయి. స్వచ్ఛందముగా చేసుకునే ఈ నియమావళినే ప్రమాణాలు అంటారు. 14.10.1946న అంతర్జాతీయ ప్రమాణికరణ సంస్థ అవతరించి లండన్‌లో తొలి సమావేశం నిర్వహించింది. ఆ అక్టోబర్‌ 14‌ననే ప్రపంచ ప్రమాణాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వాలు, వినియోగదారుల అవసరాలను తీర్చడంలో ప్రమాణాలకు గల పాత్రను నొక్కి చెప్పడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యాలు. అమెరికన్‌ ‌సొసైటీ ఆఫ్‌ ‌మెకానికల్‌ ఇం‌జనీర్స్(ఏఎస్‌ఎంఈ), ఇం‌టర్నేషనల్‌ ఎలక్ట్రోటెక్నికల్‌ ‌కమిషన్‌(ఐఈసీ), ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ‌ఫర్‌ ‌స్టాండర్డైజేషన్‌(ఐఎస్‌ఓ), ఇం‌టర్నేషనల్‌ ‌టెలికమ్యూనికేషన్‌ ‌యూనియన్‌ (ఐటీయు), ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అం‌డ్‌ ఎలక్ట్రానిక్స్ ఇం‌జనీర్స్(ఐఈఈఈ), ఇం‌టర్నెట్‌ ఇం‌జనీరింగ్‌ ‌టాస్క్ ‌ఫోర్స్(ఐఈటీఎఫ్‌) ‌వంటి ప్రమాణాల అభివృద్ధి సంస్థలలో స్వచ్ఛంద ప్రమాణాలను అభివృద్ధి చేసే వేలాది మంది నిపుణుల కృషిని కొనియాడుతారు.

1946, అక్టోబరు 14న లండన్‌లో జరిగిన సమావేశంలో 28 దేశాల ప్రతినిధులు పాల్గొని వినియోగదారులకు ప్రామాణికమైన, నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణిక సంస్థను ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించారు. ఒక సంవత్సరం తరువాత అంతర్జాతీయ ప్రమాణిక సంస్థ ఏర్పడినప్పటికీ, 1970 వరకు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకోలేదు. ప్రస్తుతం ఈ సంస్థలో 137 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రామాణీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి పరిశ్రమలు, వినియోగదారులలో అవగాహన పెంచుతారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని జాతీయ సంస్థలు వేరువేరు రోజుల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 2014లో యునైటెడ్‌ ‌స్టేట్స్ అక్టోబరు 23న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహించింది. కెనడా దేశపు జాతీయ అక్రెడిటేషన్‌ ‌బాడీ అయిన స్టాండర్డస్ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌కెనడా(ఎస్‌.‌సి.సి) అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2012లో స్టాండర్డస్ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌కెనడా అక్టోబరు 12 శుక్రవారం రోజున ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంది.1947లో భారతదేశంలో బ్యూరో ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌స్టాండర్స్ ‌చట్టాన్ని ఆమోదించి దానిని శాసనపరమైన సంస్థగా మార్చి, ఐఎస్‌ఐ ‌ముద్రను ప్రకటించారు. 1947లోనే భారతీయ ప్రమాణాల సంస్థ తొలిసారిగా బట్టలకు, ఇంజనీరింగ్‌కు రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మొదటగా మన జాతీయ పతాకం ఎంత పొడవు, వెడల్పు ఉండాలో నిర్ణయించింది. నిత్య జీవితంలో మనం వాడే వస్తువులు, పదార్థాలు వివిధ ప్రమాణాలు కలిగి వుంటాయి. అందులో మేలయిన, గుర్తింపు పొందిన వాటినే వినియోగదారులు కొనుగోలు చేయాలి. నేడు ప్రతి పదార్థం కల్తీగా మారింది.

కోకొల్లలుగా కంపెనీల వస్తువులు మార్కెట్‌లో చలామణి అవుతున్నాయి. ఏది నకిలీయొ, ఏది అసలుదో తెలియని పరిస్థితి నెలకొని వుంది. వినియోగదారులు అవగాహన లేకుండా నకిలీ వస్తువులు కొని మోసపోతున్నారు. ఆహార పదార్థాలు కుడా నకిలీవి వాడి అనారోగ్యం పాలవుతున్నారు. గృహ సంబంధ వస్తువుల కూడా మనకు తెలియకుండ కొని నష్ట  పోతూవున్నాము. ప్రసార మాధ్యమాలలో వివిధ వస్తువుల ప్రకటనలను చూసి కొని పూర్తిగా మోసపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే వినియోగదారులమయిన మనం ఐఎస్‌ఐ ‌వంటి ప్రామాణిక సంస్థలచే గుర్తింపు పొందిన  వస్తువులనే కొనుగోలు చేద్దాం. ప్రకటనలు చూసి మోస పోకుండా నాణ్యత గల వానినే కొందాం.

– కామిడి సతీష్‌ ‌రెడ్డీ,
జడలపేట,
జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా.9848445134

Leave a Reply