Take a fresh look at your lifestyle.

ఆత్మవిశ్వాసానికి నాంది అవరోధాలే!

ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి ఏదోరకమైన ఆవేదనను కలిగి ఉంటుంది. మూగజీవులు వాటి ప్రాణరక్షణ గురించి వాటి.జీవనాధారం గురించి అనునిత్యం పరితపిస్తూనే ఉంటాయి. అదేవిధంగా ప్రతి మనిషి కూడా వ్యక్తిగ తాభివృద్ధిని కోరుకుంటూ తన తరాల ఉన్నతికై నిర్విరామంగా శ్రమిస్తూనే ఉంటాడు. పుట్టి నప్పుటి నుండి ఒక ఊహ వచ్చినంతవరకూ మరియు ఆ తర్వాతి జీవితకాలంలో ఎన్నో రకాల బాధాలను, బాధ్యతలను మోస్తూ ముందుకు వెళ్తుంటాడు. ఈ తరుణంలో కొన్ని విపరీతమైన మరియు అందోళనకరమైన మానసిక సంఘర్షణలను ఎదుర్కొంటాడు.చేసే పనిలో, తిరగడే సమాజంలో,బాధ్యుడైన వ్యవస్థలో ఇలా ఒక్కొక్క చోట ఒక్కో రకమైన పరిస్థితులను అనుభవిస్తుంటాడు.కొన్ని సమయాల్లో వయసుకు మించిన భారంతో ,అనుభావానికి మించిన ఆలోచనాలతో కుస్తీ పడాల్సి ఉంటుంది.

కొన్ని సార్లు చేసే పనుల్లో నిబద్ధత ఉన్న ఫలితం లేకుండా పోయి మానసిక ఆవేదనకు గురికావాల్సి వస్తుంది. ఎంతో కార్యచరణతో విధేయతపూరితమైన ఆలోచన సరళితో ముందుకెళ్తున్నా అవరోధాలు అనేవి అడ్డగిస్తుంటాయి.ఈ తరణంలో మనపై మనకు ఒక గట్టి నమ్మకాన్ని కలిగించుకునే ఉన్నతమైన ప్రయత్నమే ఆత్మవిశ్వాసం. మనల్నీ మనం నమ్ముకుని ఎన్ని ఆపదలు,అడ్డంకులు వచ్చిన మొక్కవోని దీక్షతో అంచెలంచెలమైన ఆలోచ నాలతో ప్రయత్నించడమే ఆత్మవిశ్వాసం యొక్క ప్రధాన లక్షణం. కల చెదిరిపోయిన కన్నీరు పెట్టుకోని కదిలిపోకుండా కడాలి లాంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచేవాడే విజేతగా మన ముందుంటాడు.సమయనుకూలంగా ,విచక్షణపూరితమైన ఆలోచనవిధానంతో తీసుకునే నిర్ణయాలే ఆత్మవిశ్వాసానికి తొలి మెట్టులా తోడుంటాయి.

చెదిరిన ఆశలు ఎదురైన అదరని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రతి ఒకరూ విజయతీరాలను తప్పక చేరుతారు.జీవిత కాలంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ నిర్ణయి ంచుకున్నా లక్ష్యాలను, ఆలోచనాలను, ఆదర్శాలను దెబ్బతీస్తుంటాయి. అలాంటి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన పట్టు సడలని ఆత్మవిశ్వాసంతో కార్యదీక్షతతో ముందుకు సాగాలి. అవరోధాల మాటున ఉన్న అంతర ంగాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిం చుకుంటూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. అవరోధాలు ఎంత ఎదురైన వాటికి ధీటైన సమాధానం చెప్పే వినూత్నమైన వ్యక్తిత్వానికి నిదర్శనమే ఆత్మవిశ్వాసం. అవరోధాల మాటున అంతులేని ఆత్మవిశ్వాసం దాగి ఉంది.ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని అధిగమించిన క్షణమే ఆత్మ విశ్వాసమనే. అద్భుతమైన, అనంతమైన లక్షణం అలవాటు అవుతుంది.

ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికి అనంతపు అవకాశాలను వారధిని చేస్తూ విజయబావుటాను ఎగరవేసేలా చేస్తుంది. ప్రతి మనిషి విజయానికి ఒక శక్తి చైతన్యపు ధారలా ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ నీడలా ఉంటుంది. ఎవరికి వారు గౌరవించుకోవడం, ఎవరిని వారు నమ్ముకోవడం, ఎవరిని వారు సంస్కరించు కోవడం,ఎవరికి వారు ఆత్మపరి శీలనతో పాటు ఆత్మవిమర్శ చేసుకోవడం అనేవి అరుదైన ఆత్మవిశ్వాసపు లక్షణాలు.ఈ ప్రపంచంలో ప్రతి విజేత వెనుకలా అంతులేని అవరోధాల ఆవేదన ఉంటుంది. అవరోధాలు ఎదురైనప్పుడు మానసిక ఆవేదనకు గురికా కుండా మానో నిగ్రహంతో, మానసిక ధైర్యం తో అలుపెరగని ఆత్మవి శ్వాసంతో చేసే ప్రయత్నం విజయాన్ని చేకూరు స్తుంది.చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు ఆత్మనూన్యతకు లోనుఅయి ఉన్నతమైన జీవితాలను నిర్వీర్యం చేసుకోకుండా అనంతమైన, అచెంచెలమైన ,ఆకుంరి •తమైన,అవిరాళమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాం.

– బండి.వంశీకృష్ణ గౌడ్‌, ‌రంగయ్యపల్లి
రేగొండ, జయశంకర్‌ ‌జిల్లా
9550837962

Leave a Reply