Take a fresh look at your lifestyle.

భారత్‌కు భారం కానున్న స్థూలకాయం..!

‘‘స్థూలకాయ సంక్షోభంలోంచి బయట పడడానికి జీవితాంతం సక్రమ జీవనశైలిని పాటించాల్సిందే అని మరువరాదు. పరిమిత పరిమాణంలో ప్రతి రోజు(500-600 కాలరీల శక్తి లోపు) అల్పాహారం, మధ్యాన్న, రాత్రి భోజనాలు తీసుకోవాలి. మధ్యలో కొద్దిగా పండ్లు, డ్రై ఫ్రూట్స్, ‌మజ్జిగ లాంటివి తీసుకోవచ్చు. గృహ వంటను మాత్రమే తీసుకోవాలి. జంక్‌/‌ప్రాకెట్‌ ‌రుచులకు దూరంగా ఉండాలి, రోజు కనీసం 30-45 నిమిషాల వ్యాయామం చేస్తూ, 6-8 గంటల సమయం నిద్రకు కేటాయించాలి. పీచు పదార్థాలు కలిగిన ఆహారం ఉండేలా చూసుకుంటూ, టీ/కాఫీలను 2 సార్లకు కుదించాలి. ప్రతి రోజు ఒక కేజీ బరువుకు 30 మిలీ నీటిని తాగుతూ, కోవ్వులు/చెక్కర/ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. శుభకార్యాలు, పార్టీల్లో ఆహారాలను మితంగా తీసుకోవడం మరువరాదు. సలాడ్లను మధ్య మధ్యలో తీసుకోవడం మంచి అలవాటని తెలుసుకోవాలి. నాలుక రుచులకు బానిసగా మారితే స్థూలకాయం బహుమతిగా లభిస్తుంది.’’

భారతదేశ వ్యాప్తంగా 15-49 ఏండ్ల వయస్సు కలిగిన స్త్రీ పురుషులలో స్థూలకాయం లేదా అధిక బరువు సమస్య దినదినం క్రమంగా పెరుగుతుండటం భారత భవిష్యత్తు ప్రజారోగ్యం ప్రమాదకరంగా మారనుందని తెలుస్తున్నది. 2019-20లో ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం సర్వే చేసిన గుజరాత్‌, ‌మహారాష్ట్ర లాంటి 6 రాష్ట్రాలు మినహ ఇతర 16 రాష్ట్రాలలో స్థూలకాయులు పెరుతుండడం గమనించారు. బాడీ మాస్‌ ఇం‌డెక్స్ (‌బియంఐ) పరీక్షలతో నిర్థారించే స్థూలకాయ సమస్య ఆంధ్రప్రదేశ్‌, ‌గోవా, కర్నాటక, తెలంగాణ, కేరళ, హిమాచల్‌ ‌లాంటి రాష్ట్రాల్లో దాదాపు 33.33 శాతం స్థూలకాయ సమస్య ఉందని అంచనా వేశారు. పురుషుల కన్న మహిళల్లో స్థూలకాయ సమస్య ఎక్కువగా కనిపించడం ఆశ్చర్యాన్ని, ఆలోచనలను రేకెత్తిస్తున్నది.

అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం, జంక్‌ ‌ప్యాక్డ్ ‌ఫుడ్‌ ‌రుచులకు అలవాటు పడడం, సరైన ఆహార అలవాట్లు లేకపోవడంతో స్థూలకాయం పెరుగుతుందని తెలుస్తున్నది. కేరళలో 38 శాతం, ఆంధ్రప్రదేశ్‌/‌గోవాల్లో 36 శాతం, తెలంగాణలో 30 శాతం స్థూలకాయ సమస్య ఉందని అధ్యయనాలు తెలియజేస్తున్నారు.
కోవిడ్‌-19 ‌మహమ్మారి వలె స్థూలకాయ సమస్య కూడా మరో విపత్తుగా మారనుందనే హెచ్చరికలను వింటున్నాం. 2020లో స్థూలకాయ సమస్యలకు సంబంధించి ప్రపంచవ్యాప్త మార్కెట్‌లో 263 బిలియన్‌ ‌డాలర్ల వ్యాపారం జరుగుతోందని, 2027 వరకు ఈ ఖర్చులు 423 బిలియన్‌ ‌డాలర్లకు పెరగవచ్చని అంచనా. వరల్డ్ ఒబేసిటీ ఫౌండేషన్‌ ‌వివరాల ప్రకారం 2040 నాటికి 30 శాతం భారతీయులు స్థూలకాయ జాబితాలోకి చేరతారని తెలుస్తున్నది.

శరీర శక్తి అవసరాలకు మించి ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామాలు లోపించడం, అసంబద్ధ జంక్‌/‌ప్యాకెట్‌ ఆహారం తీసుకోవడం లాంటి ఆహార అలవాట్లతో ఒబేసిటీ ఉద్భవిస్తోంది. స్థూలకాయ సమస్య నివారణకు సూపర్‌ ‌ఫుడ్‌, ‌మ్యాజిక్‌ ‌మాత్రలు, ప్రత్యేక పరికరాలంటూ ఏమీ ఉండవని, శారీరక బరువు అదుపులో ఉండడం స్వల్పకాలిక జాగ్రత్తలు సరిపోవని, జీవితాంతం సులభ జీవనశైలిని పాటించాలని అర్థం చేసుకోవాలి. నిపుణులు సూచించిన ఆహార పదార్థాలను తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, సక్రమ హైడ్రేషన్‌, ఆరోగ్యకర నిద్ర లాంటి సరళ జీవనశైలితో స్థూలకాయ సమస్య సమసిపోతుందని వివరిస్తున్నారు. ఒక కెజీ కొవ్వు 7, 710 కిలో కాలరీల(సాధారణంగా కాలరీలు) శక్తికి సమానమని, బరువు తగ్గడానికి ప్రతి రోజు 500 కాలరీలకు సమానమైన ఆహారాలను తగ్గించి తీసుకున్నపుడు వారంలో 454 గ్రామ్‌ల శరీర బరువు తగ్గడం జరుగుతుందని విశ్లేషించారు. సత్వరమే బరువు తగ్గాలనే దురాలోచనలతో ఆహారాన్ని అతిగా తగ్గిస్తే(1,800 కాలరీల శక్తి సమాన ఆహారం) పోషకాల సమతుల్యత దెబ్బతిని తీవ్ర అనారోగ్యం కలుగుతుందని గుర్తుంచుకోవాలి.

స్థూలకాయ సంక్షోభంలోంచి బయట పడడానికి జీవితాంతం సక్రమ జీవనశైలిని పాటించాల్సిందే అని మరువరాదు. పరిమిత పరిమాణంలో ప్రతి రోజు(500-600 కాలరీల శక్తి లోపు) అల్పాహారం, మధ్యాన్న, రాత్రి భోజనాలు తీసుకోవాలి. మధ్యలో కొద్దిగా పండ్లు, డ్రై ఫ్రూట్స్, ‌మజ్జిగ లాంటివి తీసుకోవచ్చు. గృహ వంటను మాత్రమే తీసుకోవాలి. జంక్‌/‌ప్రాకెట్‌ ‌రుచులకు దూరంగా ఉండాలి, రోజు కనీసం 30-45 నిమిషాల వ్యాయామం చేస్తూ, 6-8 గంటల సమయం నిద్రకు కేటాయించాలి. పీచు పదార్థాలు కలిగిన ఆహారం ఉండేలా చూసుకుంటూ, టీ/కాఫీలను 2 సార్లకు కుదించాలి. ప్రతి రోజు ఒక కేజీ బరువుకు 30 మిలీ నీటిని తాగుతూ, కోవ్వులు/చెక్కర/ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. శుభకార్యాలు, పార్టీల్లో ఆహారాలను మితంగా తీసుకోవడం మరువరాదు. సలాడ్లను మధ్య మధ్యలో తీసుకోవడం మంచి అలవాటని తెలుసుకోవాలి.

నాలుక రుచులకు బానిసగా మారితే స్థూలకాయం బహుమతిగా లభిస్తుంది. బరువు తగ్గడానికి 80 శాతం ఆహార నియమాలు, 20 శాతం వ్యాయామం దోహదపడతాయి. బరువును అదుపులోకి తెచ్చిన తరువాత నిర్లక్ష్యం చేస్తే మళ్లీ బరువు పెరగడానికి ఎంతో సమయం పట్టదని గుర్తుంచుకోవాలి. శారీరక బరువు తగ్గడంతో పాటు ఎత్తుకు/వయసుకు సరైన బరువును కలిగి ఉండడం జీవితకాల జీవనశైలితో మాత్రమే సాధ్యపడుతుందని మరువరాదు. తేలికైన శరీరంతో ఆకాశమే హద్దుగా అభివృద్ధి పథంలో ఆయురారోగ్యాలతో సన్మార్గంలో సంచరిద్దాం. స్థూలకాయ సమస్యను తెలివిగా పొలిమేరలు దాటేదాక తరిమేద్దాం.

ై డా।। బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
 కరీంనగర్‌ – 9949700037

Leave a Reply