Take a fresh look at your lifestyle.

బీజేపీ చేతిలో పల్లా ఓటమి ఖాయం…

  • దుబ్బాక ఎన్నికలతోనే కేసియర్ పతనం ప్రారంభమైంది…
  • ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కోవా లక్ష్మణ్

నకిరేకల్, మార్చి 6 (ప్రజాతంత్ర విలేకరి) :తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ గెలుపుతో కల్వకుంట్ల కుటుంబ పతనం ప్రారంభమైందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కోవా లక్ష్మణ్ అన్నారు.శనివారం నాడు నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గార్డెన్స్ లో మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి కోసం నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం ప్రసార మాధ్యమాల్లో, దినపత్రికల్లో అవినీతి కుంభకోణాల వార్తలు ప్రధాన శీర్షికగా ఉండేవని నేడు మోడీ హయాంలో అవినీతి రహిత పాలన సాగుతోంది అన్నారు.2జి,3జి స్పెక్ట్రమ్ అవినీతి, భూమి మీద,ఆకాశంలో, సముద్రంలో సైతం కుంభకోణాల ఆరోపణలు ఎదురుకున్నారనీ చెప్పారు. నరేంద్రమోదీ ప్రభుత్వం లో చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా పనితీరు ఆదర్శంగా కొనసాగుతుందన్నారు.

చెయ్యి తడిపితే తప్ప పని కానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పతనం అయిందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో టిఆర్ఎస్ పాలన నిర్లక్ష్యం కారణంగా వరదలతో సముద్రం చూపించిన ఘనత తెరాస ప్రభుత్వానిదే అన్నారు.కొరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి 500 రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ అకౌంట్ లో మోడీ ప్రభుత్వం జమ చేసింది అన్నారు. హైదరాబాదులో వచ్చిన వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఆదుకుంటామని చెప్పి నేరుగా డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టి వేయి రూపాయలు ఇచ్చి తొమ్మిది వేల రూపాయలు నొక్కేశారు అని ఎద్దేవా చేశారు.హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్ నాయకులు నేరుగా డబ్బులు పంచినా గెలువలేక పోయారని పేర్కొన్నారు.

- Advertisement -

గత ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రజల వోట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కేసీఆర్ కొనుగోలు చేయడం సిగ్గుమాలిన చర్యగా వర్ణించారు. తెలంగాణ లో బీజేపీ నాయకత్వన్నీ కోరుకుంటున్నారని టీఆరెస్ పతనం ప్రారంభం అవుతుందని అన్నారు. దొడ్డిదారిన బిడ్డకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని తెలియజేశారు.

ఇంటికి ఒక ఉద్యోగం అన్న ముఖ్యమంత్రి నేటికి కూడా నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసి కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు పాల్వాయి రజిని కుమారి, గోలి ప్రభాకర్, మండల వెంకన్న పాల్వాయి భాస్కర్ రావు ,నరసింహ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అంతకంటే ముందు మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.

Leave a Reply