Take a fresh look at your lifestyle.

పోషకాహార పోరాటం

ఎప్పుడో ఆకలికేకల ఆర్తనాదాలు ఆరేదిక్కడ
అభివృద్ది ముసుగులో
ఆరోగ్యం
పోషకాలు లేని
ఎముకలగూడు తునాతునకలైపోతుంటే
ఎంతెదిగితే ఏంలాభం?
మనిషి శరీరారోగ్యం శల్యమైపోతుంటే
రోగాల మబ్బులలుముకుంటూ
కనరాని బలహీనతతో బహిరంగంగా చతికిలబడిపోదా దారుడ్యం
దేశమంటే మట్టికాదన్నారు
మనుషులన్నారుజి
బలహీనులా…బలవంతులా
మొక్కైనా మనిషైనా
పోషణలేనిదే ఎదుగుదలెక్కడిది?
పోషకాహారలోపం మనిషిని నిలువెల్లా దహిస్తుంటే
దేశమేగతి బాగుడునో మరి
అభివృద్ధిలో మనవెనుకున్న దేశాలే
మనకంటే మేలుమరి
పాలనలో లోపంతో లోలోపల
మాడిమసైపోతున్న మనిషికి అందించాలి పోషకాహారం
ప్రణాళికలు రచించాలి
ప్రాణాలను రక్షించాలి
దేశానికి చేయుతనిచ్చే శక్తులనందించాలి
ప్రపంచాన మనమెపుడు జయమొందాలి
మహాభాగ్యంతో భారతదేశం భవిష్యత్తు నిర్మాణమవ్వాలి

– సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు,
9010580557.

Leave a Reply