Take a fresh look at your lifestyle.

పోషకాహార కార్యక్రమం: ప్రజా ఉద్యమం ద్వారా ప్రవర్తనలో పరివర్తన

పౌష్టిక భారతం దిశగా గౌరవనీయ ప్రధానమంత్రి మేల్కొలుపు దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది.ఈ మేరకు పిల్లలు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపం భర్తీకి సమగ్ర పౌష్టికత లేదా పోష కాహార కార్యక్రమం పేరిట ప్రధాని ప్రవే శపెట్టిన భారత ప్రభుత్వ ప్రతి ష్టాత్మక పథకం సత్ఫలితాలిస్తోంది. తరతరాలుగా నిరంతర పోషకాహార లోపానికి దారితీసే తప్పుడు లేదా అవగాహనరహిత సమాచారం ఫలితంగా అనుసరించిన పద్ధతులను రూపుమాపేందుకు అట్టడుగు స్థాయిలోని సమాజాలలో చైతన్యం పెంచడం ఈ కార్యక్రమంలో కీలక కర్తవ్యం.ఇందులో భాగంగా ప్రవర్తనపరమైన పరివర్తన తేవడం కోసం ఈ పథకం కింద కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేయబడింది. వీటిలో సమాజాధారిత కార్యక్రమ నిర్వహణ సంస్థ (సీబీఈ), సమాచార-అవగాహన-చైతన్య కల్పనబీ సలహాలు-సమన్వయంతో విస్తృత ప్రజా భాగస్వామ్యం ద్వారా ప్రజా ఉద్యమం చేపట్టడం ముఖ్యమైనవి.
పోషకాహార కార్యక్రమం లక్ష్యాలపై దృష్టి సారిస్తూ 2021-2022 బడ్జెట్లో ‘మిషన్‌ ‌పోషణ్‌ 2.0’ (‌శక్తియుత అంగన్వాడీ-పోషకార కార్యక్రమం 2.0) ప్రకటించబడింది. పోషక సమృద్ధ, ఆహార సరఫరా, అమలు, ఫలితాల బలోపేతం చేయడంద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించే పద్ధతుల రూపకల్పన కోసం సమీకృత పోషకాహార మద్దతు కార్యక్రమంగా ఇది పకటించబడింది. ఈ మేరకు పోషకాహార లోపాన్ని సరిదిద్దడం ద్వారా ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తికి ఇది తోడ్పడుతుంది. సామాజిక, ప్రవర్తన మార్పుపై అవగాహనతో ప్రజా ఉద్యమ నిర్మాణ వ్యూహాత్మక స్తంభాలలో ఒకటిగా ఈ కార్యక్రమం లక్ష్యసాధనకు దోహదపడుతుంది. పోషకాహార కార్యక్రమ అమలు, ఫలితాల మెరుగు లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలను రూపొందించి, నిర్వహించడంపై ఇది దృష్టి సారిస్తుంది. అలాగే ఉద్యమ తరహాలో పోషకాహార లోపం సవాలును అధిగమించడం దీని లక్ష్యంగా ఉంది. సామాజిక సమీకరణతోపాటు ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రవర్తనలో పరివర్తన  కోసం ఏడాది పొడవునా నిర్దిష్ట కార్యక్రమాలతో ఈ పథకంద్వారా నిరంతర కృషి కొనసాగింది. ఈ కార్యక్రమాలు వివిధ వేదికలను సద్వినియోగం చేసుకుంటూ పోషకాహార సంబంధిత సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి.
ఈ ముమ్మర కృషిలో భాగంగా ఏడాది పొడవునా పోషకాహార మాసం, పోషకాహార పక్షం వంటి కార్యక్రమాలతో తల్లులతోపాటు సామాజికంగా ప్రజానీకం ఆరోగ్యకర పోషకాహార ప్రవర్తనను అనుసరించేలా ప్రయత్నం కొనసాగింది. ఈ మేరకు ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రతి నెలలో రెండుసార్లు నిర్దిష్ట తేదీన ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో సామాజిక కార్యక్రమాల కింది అన్నప్రాశన దినోత్సవం, పోషకాహార దినోత్సవం (గర్భిణుల భర్తలలో అవగాహన పెంపు లక్ష్యంగా) యుక్త వయస్సుకు వచ్చిన సందర్భంలో వేడుక నిర్వహణ, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను పాఠశాల పూర్వ విద్యకు సిద్ధం చేయడం, పోషకాహారం మెరుగుదల దిశగా ప్రజారోగ్య సంబంధిత సందేశాలు,చేతుల పరిశుభ్రత-పారిశుధ్యం ప్రాముఖ్యంపై అవగాహన, రక్తహీనత నివారణ, పౌష్టికాహార ప్రాముఖ్యం వివరణ, ఆహార వైవిధ్యం తదితర అంశాలకు ప్రధాన్యం ఇవ్వబడింది. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అంగన్వాడీలలో ఈ విధమైన 3.70 కోట్లకార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
       పోషకాహారంపై దృష్టి పెట్టడానికి, మంచి పోషకాహార పద్ధతులు-ప్రవర్తనపై అవగాహన పెంచడానికి పోషకాహార కార్యక్రమంలోని ప్రజా ఉద్యమ అంశంకింద రెండు ప్రధాన ప్రచార, సామాజిక-ప్రవర్తన మార్పు కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. తదనుగుణంగా ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఏటా సెప్టెంబరులో నాలుగు ‘జాతీయ స్థాయి పోషక మాసోత్సవాలు’, మార్చి నెలలో నాలుగు ‘పోషకాహార పక్షోత్సవాలు’ నిర్వహించగా అత్యధిక స్థాయి హాజరీతోపాటు అత్యుత్తమ ఫలితాలు లభించాయి. పోషకాహార మేళాలు, ప్రభాత్‌ ‌ఫేరీ, పాఠశాలల్లో పోషకాహారంపై సదస్సులు, స్వయం-సహాయక బృందాల సమావేశాలు, రక్తహీనతపై శిబిరాలు, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, ఆశా/అంగన్వాడీ కార్యకర్తల ఇంటింటి సందర్శన, గ్రామీణ ఆరోగ్యం-పారిశుద్ధ్యం, పోషకాహార దినోత్సవాలు వంటి కీలక కార్యకలాపాలు నిర్వహించారు. ఇప్పటివరకూ నిర్వహించిన పోషకాహార మాసోత్సవాలు, పక్షోత్సవాలలో కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని వివిధ మంత్రిత్వశాఖలు, క్షేత్రస్థాయి కార్యనిర్వాహకుల మధ్య సమన్వయం అత్యుత్తమ స్థాయిలో ఉంది.
పోషకాహార కార్యక్రమం ప్రజా ఉద్యమంగా రూపొందడంలో ముందువరుస సిబ్బంది, సామాజిక బృందాలు, పీఆర్‌ఐలు, సమితి- జిల్లాస్థాయి సిబ్బందితోపాటు కేంద్ర, రాష్ట్రాల్లోని వివిధ శాఖలు అద్భుతంగా కృషిచేశాయి. ముఖ్యంగా 2021లో నిర్వహించిన నాలుగో విడత జాతీయస్థాయి పోషణ మాసోత్సవాలలో భాగంగా మొత్తం 20.32 కోట్ల కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. అదేవిధంగా 2022లో మార్చి 21-ఏప్రిల్‌ 4 ‌మధ్య నిర్వహించిన పోషకాహార పక్షోత్సవాలలో కింద 2.96 కోట్ల ప్రజా ఉద్యమ కార్యకలాపాలు నిర్వహించారు.
పోషకాహార కార్యక్రమం కింద నెలవారీ కార్యకలాపాల్లో భాగంగా లబ్ధిదారులకు పోషకాహారంపై మాత్రమేగాక సాధారణ ఆరోగ్య-పరిశుభ్రత పద్ధతులపైనా అవగాహన కల్పించబడుతుంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద గ్రామీణ ఆరోగ్యం-పోషకాహార దినోత్సవం నిర్వహణ విధానం రూపొందించబడింది. ఇది దేశంలో 2007 నుంచి అమలవుతుండగా… సామాజిక-ఆరోగ్య వ్యవస్థలను అనుసంధానిస్తూ సమన్వయంతో చర్యలు చేపట్టేందుకు తోడ్పడుతుంది. అంతేగాక ఆరోగ్యం, బాలల అభివృద్ధి, పోషకాహారం, పారిశుద్ధ్య సేవలను ఇళ్లముంగిటకు చేర్చడానికి కృషిచేస్తుంది. మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సామాజిక భరోసా కల్పించడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా సమాజంలో ఆహార వైవిధ్యం మెరుగుకు, అవగాహన కల్పనతోపాటు పోషకాహార లోపంగల పిల్లలకు వివిధ ఆహార పదార్థాలను అందించడానికి కృషి చేస్తుంది. ఈ మేరకు సామాజిక వినియోగార్థం స్థానిక, కాలానుగుణ ఉత్పత్తులనుప్రోత్సహించడం కోసం పోషణవాటికలు, పోషకాహార తోటలు అభివృద్ధి చేయబడ్డాయి. వీటిలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్ల ద్వారా పోషకాహారం సరఫరా చేయడమే పోషకాహార కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దీనికి అనుగుణంగా ఆయుష్‌ ‌మంత్రిత్వశాఖ ద్వారా మొక్కల పంపిణీ కింద 21 జిల్లాల్లో 1.10 లక్షల ఔషధ మొక్కలను నాటడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. దీంతోపాటు 4.37 లక్షల అంగన్వాడీ కేంద్రాలు సొంత పోషణ వాటికలు కలిగి ఉండటం విశేషం.
ప్రజా ఉద్యమాన్ని ప్రజా భాగస్వామ్యంగా మార్చడం లక్ష్యంగా మేమిప్పుడు ఐదో ‘జాతీయపోషకాహార మాసోత్సవాల’ను నిర్వహిస్తున్నాం. పోషకాహార పంచాయతీలుగా వ్యవహరించే గ్రామ పంచాయతీల ద్వారా సందేశ వ్యాప్తిద్వారా పోషకాహార లోపం సమస్య పరిష్కారానికి ఇది కృషి చేస్తుంది. పోషకాహార పంచాయితీలలో ‘‘మహిళలు-ఆరోగ్యం’’, ‘‘బాలలు-విద్య’’పైనాప్రధానంగా దృష్టి కేంద్రీకరించబడింది. పౌష్టికత, చక్కని ఆరోగ్యంపై ప్రజల దృష్టినిమరల్చేందుకు జాతీయ పోషకాహార మాసోత్సవాలు ఒక వేదికగా ఉపయోగపడతాయి. తద్వారా సమన్వయ విధానంతో పోషకాహార కార్యక్రమం సంపూర్ణ లక్ష్యాల సాధనకు దోహదంచేస్తాయి. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన (2019-21) జాతీయకుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌ఎఫ్హెచ్‌ఎస్‌)‌నివేదిను ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం- భారతదేశం (2015-16) జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4తో పోలిస్తే వివిధ పోషకాహార సూచీలలో ఎంతో మెరుగుపడింది.
అంటే- ‘ఎన్‌ఎఫ్హెచ్‌ఎస్‌-5’ ‌ప్రకారం పిల్లలలో ఎదుగుదల లోపం 38.4 శాతం నుంచి 35.5 శాతానికి తగ్గింది. అలాగే వృథా 21.0 శాతం నుంచి 19.3 శాతానికి, తక్కువ బరువు సమస్య 35.8 శాతం నుంచి 32.1 శాతానికి తగ్గాయి. మరోవైపు (15-49ఏళ్ల మధ్య) మహిళల్లో శరీర బరువు పరిమాణ సూచీ (బీఎంఐ) సాధారణంకన్నా తక్కువగా ఉన్నవారి శాతం ‘ఎన్‌ఎఫ్హెచ్‌ఎస్‌-4’‌తో పోలిస్తే ‘ఎన్‌ఎఫ్హెచ్‌ఎస్‌-5’‌లో 22.9 శాతం నుంచి 18.7 శాతానికి తగ్గింది.
ఉదాత్త, సమగ్ర లక్ష్యంతో ప్రారంభమైన పోషకాహార కార్యక్రమం ప్రవర్తనలో పరివర్తనను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు చంటిబిడ్డల తల్లులు, యుక్తవయస్సులోగల బాలికలు, గర్భిణులు, బాలింతలు, భర్తలు, తండ్రి-అత్తమామలు, ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాతలు (ఎఎన్‌ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు), సామాజిక సభ్యులుసహా కుటుంబాలలో పోషకాహారంపై అవగాహన పెంపునకు అవిరళ కృషి చేసింది. తదనుగుణంగా సమాజ భాగస్వామ్యం-సామాజిక కార్యక్రమాలపై కీలక దృష్టితో పోషకాహార ప్రవర్తన విధానాలపై చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించింది. ప్రజానీకంలో సానుకూల ఆరోగ్య ప్రవర్తనను ప్రోత్సహించడంలో మార్పు దిశగా ప్రచార కార్యక్రమం ఒక శక్తిమంతమైన ఉపకరణం. ప్రజాకార్యక్రమాల్లో పౌష్టికాహార ప్రాధాన్యాన్ని ప్రధానాంశం చేయడంపైనే పోషకాహార కార్యక్రమ విజయం ఆధారపడి ఉంది.
image.png
 డాక్టర్‌ ‌ముంజపరా మహేంద్రభాయ్‌, ‌కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి-ఆయుష్‌ ‌శాఖ సహాయ మంతి

Leave a Reply