Take a fresh look at your lifestyle.

34‌కు చేరిన సుప్రీమ్‌ ‌కోర్టు జడ్జిల సంఖ్య

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 13 : భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్‌ ‌కోర్టులో జడ్జిల సంఖ్య 34కు చేరింది. సోమవారం నుంచి 34 మంది పూర్తిస్థాయి న్యాయమూర్తులతో పనిచేయనుంది. సుప్రీం కోర్టులో జడ్జీల నియామకానికి కొలీజియం చేసిన రెండు సిఫార్సులకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 2019 తర్వాత, తొలిసారిగా భారత సుప్రీమ్‌ ‌కోర్టులో 34 మంది సిట్టింగ్‌ ‌జడ్జిలు ఉంటారు. సుప్రీంకోర్టు న్యాయ మూర్తులుగా మరో ఇద్దరు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్తగా పదవి పొందిన జస్టిస్‌ ‌రాజేష్‌ ‌బిందాల్‌, అరవింద్‌ ‌కుమార్‌లతో భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ ‌డీవీ చంద్రచూడ్‌ ‌ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ ‌రాజేష్‌ ‌బిందాల్‌ ఇదివరకు అలహాబాద్‌ ‌హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌గా పనిచేశారు. జస్టిస్‌ అరవింద్‌ ‌కుమార్‌ ‌గుజరాత్‌ ‌హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌గా ఉన్నారు. వీరి రాకతో జడ్జిల సంఖ్య 34కు చేరింది.

Leave a Reply