ఆనాడు నిజాం కాలంలో 1938లో హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఈ నుమాయిష్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ సోసైటీ 80 ఏళ్లపాటు అద్భుతంగా నిర్వహించిందని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉత్పత్తులు హైదరాబాద్ కు తెచ్చిన ఘనత ఎగ్జిబిషన్ సోసైటీదేనని, నుమాయిష్ మాత్రమే కాకుండా 18 విద్యాసంస్థలను పెట్టి 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం గొప్పవిషయమన్నారు.
హైదరాబాద్ తోపాటు రూరల్ తెలంగాణలోను విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యార్థినులకు చక్కటి విద్య అందిస్తున్నారన్నారు..నుమాయిష్ తోపాటు సేవాకార్యక్రమాలు చేపడుతున్న ఎగ్జిబిషన్ కమిటీ దీన్ని మరింత అభివృద్ది చేయాలని, మరిన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.నుమాయిష్ లో స్టాళ్లు ఏర్పాటు చేసిన వాళ్లకు, కష్టపడిన వాళ్లకు జ్ఞాపికలతో పాటు బహుమతి ఇస్తే వారి కుటుంబ సభ్యులుసైతం ఆనందిస్తారని సలహా ఇచ్చారు.నుమాయిష్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించిన ఎగ్జిబిషన్ కమిటీని, పోలీసులను, వాలంటీర్లను, అగ్నిమాపక దళ సభ్యులను, మీడియాను ఆయన అభినందించారు.