ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ వెంకట్రావుకి కొరోనా పాజిటివ్
ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ రావు కి కొరోనా పాజిటివ్ వచ్చింది ..దింతో తెలంగాణ కాంగ్రెస్ ,గాంధీభవన్ లో టెన్షన్ నెలకొంది .గురువారం అధికారికంగా వెంకట్ కు పాజిటివ్ వచ్చినట్లు పీ ఆర్వో ప్రకటన చేశారు.
బలమూరి వెంకట్ తో పాటు, ఆయన సోదరులు వరుణ్ కు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రితేష్ లకు కూడా కరోనో పాజిటివ్ వచ్చింది..ఇటీవలే బలమూరి వెంకట్ గాంధీభవన్ లో రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.అలాగే హై కోర్ట్ లో డిగ్రీ ,బీటెక్ ఈ సెమిస్టరు విద్యార్థులను నేరుగా ప్రోమోటో చేయాలని పిటిషన్ వేశారు .అలాగే మంత్రి సబితా ఇందిరా రెడ్డి ని ,వైస్ చాన్స్లర్ లను కలిసారు.ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లో గూడురునారాయణ రెడ్డి ,మాజీ ఎంపీ విహెచ్ కి పాజిటివ్ రాగ మరికొందరు నేతలు ఇప్పటికే హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం .