
ప్రపంచంలోని తెలుగువారందరికీ పరిచయం అవసరం లేని కంఠం ఆయనది. రేడియోవ్యాఖ్యాతగా తన సుమధుర వచనంతో తెలుగు భాషాప్రియులను పలుకరిస్తూ ఎన్ఆర్ఐ రేడియోకు మంచిపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన భాషాప్రియుడాయన. ప్రతీ సుప్రభాతవేళ ఎన్ఆర్ఐ రేడియో నుంచి పలుకరించే తెలుగు శ్రోతల మిత్రుడు క్రాంతి. ఇండియా రేడియో ఆడిషన్స్‌లో వ్యాఖ్యాతగా సెలెక్ట్ అయిన తేదీ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ రంగంలో తన బలమైన ముద్రను వేసుకుంటూ వ్యాఖ్యాతగా స్థిరపడ్డారు. క్రాంతి ఇదివరలో హలో ట్విన్సిటీస్ అంటూ పలుకరించి రెయిన్బో ఎఫ్ఎం(101.9) లో వ్యాఖ్యానంతో శ్రోతలను మెప్పించారు. పాటల తోటలో పేరు ప్రఖ్యాతులు సాధించాలని, తన కన్నతల్లి కోరికను నెరవేర్చాలని ఆయన ఎంతో శ్రమించారు కూడా. కానీ అవకాశాలు ఎక్కువగా వ్యాఖ్యాతగానే రావడంతో ఈ రంగంలోనే స్థిరపడ్డారు. ఎన్ఆర్ఐ రేడియోలో వారాంతంలో జరిగిన కళారంగ విశేషాలను తెలియచేస్తూ ఎందరో యువగాయనీ గాయకులను శ్రోతలకు పరిచయం చేశారు.
చిత్రసీమకు సంబంధించిన విశేషాలను కొత్త సినిమాలను, ఆయా సినిమాలలోని ఆసక్తికర అంశాలను ఎన్ఆర్ఐ శ్రోతలకు తెలియచేస్తూ కోట్లాది తెలుగు భాషాభిమానుల అభిమానాన్ని ఆయన అందుకున్నారు. గాయనీ గాయకులు లిప్సిక, సందీప్‌లు, డైరక్టర్ సంకల్ప్‌రెడ్డి, హీరో సుధాకర్ ఇలా సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. ఒక వైపున వ్యాఖ్యాతగా ఊపిరి సలుపని పనులలో ఉంటూ కూడా సామాజిక సేవా కారక సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. రక్తదాన సంస్థను స్థాపించారు. ప్రమాద వశాత్తు రక్తం కోల్పోయిన వారికి, లేదా రక్త హీనతతో బాధ పడేవారికి రక్తదానం చేస్తున్నారు. పదిమందిని ఈ సంస్థలో సభ్యులను చేసుకొని అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటివరకు 102 మందికి రక్తదానం చేశారు. చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగార్థులకు మెళుకువలు చెప్పి ప్రోత్సహిస్తున్నారు. ఎన్ఆర్ఐ రేడియోలో అవకాశం లభించడం వల్లనే ఈ కార్యక్రమాలన్నింటినీ చేయగలుగుతున్నాననేది ఆయన నమ్మకం. ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్మెంట్ విలాష్, వెంకట్‌రెడ్డి, మహేష్‌లకు క్రాంతి కృతజ్ఞతలు తెలిపారు.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్
Tags: Nri radio station, kranthi, prajatantra internet desk, NRI radio jakey, Kranthi