Take a fresh look at your lifestyle.

రజితకు ఆర్థిక సహాయం చేసిన ఎన్‌ఆర్‌ఐ

బూర్గంపాడు మండలంలో మొరంపల్లి బంజార పంచా యతీలో మర్రిగుంట గ్రామం నికి చెందిన రజిత అనారోగ్యంతో కాళ్ళు, చేతులు పూర్తిగా కదలిక పోల్పోవడంతో మంచానికే పరిమితం అయింది. దానితో ప్రముఖ మానవతా వాది, మానవ దృక్పథం కలిగిన,మంచి మనసు ఉన్న దేవత ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఉన్న కూనవరం గ్రామానికి చెందినా బావినేని రాధ,శ్రీనివాస్‌ ‌దంపతుల పుత్రిక భావి నేని నర్మద ప్రముఖ అమెరికా ఎన్‌ఆర్‌ఐ, అక్షరాల 85,000 రూపాయలను తన తల్లిదండ్రుల కు ఇచ్చి చదువుల తల్లికి పంపింది. ఎంతటి ఆర్థిక సహాయం చేకూర్చడానికి క్రాంతి అనే అబ్బాయి ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ ఎలక్షన్స్ ‌డేటా ఎంట్రీ ఆఫరేటర్స్ ‌యువ కులు తమ వాట్సుప్‌ ‌ద్వారా నర్మదాకి విషయం తెలిసినది. తెలిసిన మరుక్షణమే తల్లిదండ్రులకు అమౌంట్‌ ‌నీ ట్రాన్స్ఫర్‌ ‌చేసి చదువులమ్మ కి వెళ్లి చెక్కు ఇవ్వడం జరిగింది.

మహా త్ములెందరో సామాన్యుల తోడ్పా టుతోనే విజయం సాధించారు. సహాయం చేసే మంచి వారు పక్కనే ఉంటే అక్కడే విజ యమూ ఉంటుంది. విజయసారథి అండగా ఉంటే విజయులవుతారు. అందుకే సహాయం చేయడం లో ఉన్న ఆనందం గొప్ప అనుభూతి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే సహాయం చేసే చేతులు మిన్న అనే మదర్‌ ‌థెరీసా మాటలు స్ఫూర్తిని నింపాయి ఆమెలో , ఎవరు కష్టాల్లో ఉంటే మనం ఎందుకు సహాయం చేయాలి అనుకునే వారు చాలా మంది ఉంటారు, కానీ చేతనైనంత సహాయం చేద్దాం అనుకున్న వాళ్లు అరుదుగా ఉంటారు అలాంటి కోవకు చెందినటువంటి ఆమె ఈ నర్మద ఇప్పుడు ఈ మాటే మండలం అంతా చర్చించుకుంటున్నారు. ఇంకా సహాయం చేయాలనుకుంటే చేయగలరు. తోటివారికి కష్టాల్లో ఉంటే చేతనైతే చేద్దాం రండి.చదువుల సరస్వతి ని ఆదుకుందాం. ఇంకా మనలో మానవత్వం బ్రతికే ఉన్నదని ఎలుగెత్తి చాటుదాం అని పిలుపునిచ్చారు.

- Advertisement -

Tags: A leading humanitarian, human-minded, good-hearted deity in the state of Andhra Pradesh

Leave a Reply