Take a fresh look at your lifestyle.

ఎన్‌పీఆర్‌కు చట్టబద్ధత లేదు

“పౌరుల జనగణన పదేండ్లకోసారి జరుగుతుంది. అటువంటప్పుడు ఈ పౌర పట్టిక ఎందుకన్న అబి ప్రాయం సబబుగానే ఉంది.ఎన్‌ ‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సీ లను రాష్ట్రాల మీద రుద్దేందుకు కేంద్రం ప్రయత్ని స్తోంది. తీవ్ర ఆందోళనల తర్వాత ఎన్‌ఆర్‌సీపై నిర్ణయం తీసుకోలే దని ప్రకటించింది. మరి సీఏఏ,ఎన్‌పిఆర్‌ల మాటేమిటి వాటిని కూడా  కేంద్రం ఉపసంహరిం చుకోవాలని అధిక సంఖ్యాకులు కోరుతున్నారు. చాలా రాష్ట్రాలు వీటికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా కేంద్రం మొండిగా వీటిని రుద్దేందుకు ప్రయత్నిస్తోంది.”

NPR has no legality

నేషనల్‌ ‌పాపులేషన్‌ ‌రిజిస్టర్‌ (ఎన్పిఆర్‌) ‌కు చట్టబద్ధత లేదు.ఇది మేధావుల మాట ఇది వాస్తవాలకు దూరంగా ఉంది. పౌరసత్వచట్టంలో దీని గురించి ప్రస్తావన లేదు. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి కూడా ప్రజామోదం లేదు. ఎన్‌పీ ఆర్‌, ‌సీఏఏలను అమలు జరుపబోమని కొన్ని రా ష్ట్రాలు ప్రకటించాయి. అయితే, రాజ్యాంగంలోని 256 అధికరణం కింద సీఏఏని కేంద్రం తీసుకుని వచ్చింది అందువల్ల రా ష్ట్రాలు అమలు జరిపి తీరాలన్న వాదం కూడా ఉంది.ఎన్‌ ‌పిఆర్‌ ‌కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ।। 3,000 కోట్లు కేటాయించింది.పౌరుల జనగణన పదేండ్లకోసారి జరుగుతుంది.అటువ ంటప్పుడు ఈ పౌర పట్టిక ఎందుకన్న అభిప్రాయం సబబుగానే ఉంది.ఎన్‌పిఆర్‌,ఎన్‌ఆర్‌సీ లను రాష్ట్రాల మీద రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తీవ్ర ఆందోళనల తర్వాత ఎన్‌ఆర్‌సీపై నిర్ణయం తీసు కోలేదని ప్రకటించింది.మరి సీఏఏ,ఎన్‌పిఆర్‌ల మాటేమిటి వాటిని కూడా కేంద్రం ఉపసంహరిం చుకోవాలని అధిక సంఖ్యాకు లు కోరుతున్నారు.చాలా రాష్ట్రాలు వీటికి వ్యతిరేక ంగా ఉన్నాయి.అయినా కేంద్రం మొండిగా వీటిని రుద్దేందుకు ప్రయ త్నిస్తోంది. వీటిని అమలు జరపబోమన్న రాష్ట్రాలను 356 అధికరణం కింద కేంద్రం మళ్ళీ ఆదేశించ వచ్చు.రాజ్యాంగం ప్రకారం అమలు జరపని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చు అయితే,పరిస్థితి అందాకా చేరుకోలేదు.సీఏఏని వ్యతిరేకిస్తూ రాష్ట్రాలు అసెం బ్లీల చేత తీర్మానాలను ఆమోదింపజేశాయి. అయితే,సాంకేతికంగా ఇలాంటి తీర్మానా లు సభ నిబంధనలకు వ్యతిరేకం సీఏఏకి రాజ్యాంగబ ద్ధత ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు త్వరలో పరిశీలిస్తుంది.

సీఏఏ ముఖ్యంగా బంగ్లాదేశ్‌ ‌నుంచి వచ్చిన విదేశీయుల సమస్యకు సంబంధించింది కనుక, సుప్రీంకోర్టు ఏ విధంగా పరిష్క రిస్తుందో చూడాలి.ఇందుకు సంబంధిం చిన తీర్మానం చెల్లు బాటు కాదని ఘోషించే నిబం ధనను అసెంబ్లీలు సస్పెండ్‌ ‌చేసేం దుకు అదికారం ఉంది.ఎన్‌ఆర్‌సీ మాత్రం ప్రజ లను వెంటాడుతూనే ఉంటు ంది. నిజానికి ఇది అసోంకు మాత్రమే పరిమితం అయి ంది.2003లో జాతీ య గుర్తింపు కార్డుల జారీ కోసం ఎన్‌ఆర్‌సీని అసోంలో ప్రవేశ పెట్టా రు. ఎన్‌పిఆర్‌ ‌ను మాత్రం 1955 నాటి పౌరసత్వ చట్టంలోని 18వ సెక్షన్‌లోని సబ్‌సెక్షన్స్ (1),(3)‌లకింద రూపొంది ంచారు. జాతీ య పౌరసత్వ చట్టంలో ఎన్‌పిఆర్‌కి అవకాశం లేదు. అందు వల్ల ఎన్‌పిఆర్‌కి చట్టబద్ధత లేదు,సీఏఏకి ఎన్‌ఆర్‌సీకి సంబంధం లేకపోయినా రాజకీయ నాయకులు తరచుగా ఈ రెండింటినీ ముడిపెడుతూ ఉంటారు.టాటా కంపెనీకి ఆ సంస్థ ఉద్యోగులకు మధ్య జరిగిన వివాదంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.రాజకీయ నాయకులు మాత్రం తమ వాదాన్ని బలం వినిపించడం కోసం ముడి పెడుతూ ఉంటారు.ఎన్‌పిఆర్‌కి చట్టబద్ధత లేదన్నది తిరుగులేని వాస్తవం.
‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply