Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రైతులకు మోసం

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా చిన్నాపూర్‌ ‌ధాన్యం కొనుగోలు కేంద్రాలో తొమ్మిది కిలోల తరుగు పేరిట రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ ‌రెడ్డి మండిపడ్డారు.శుక్రవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చిన్నాపూర్‌ ఐకేపి కేంద్రాన్ని డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌తో కలిసి జీవన్‌ ‌రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడీ వివరాలు తెలుసుకుని వారు చెప్పిన విషయాలతో అవాక్కయ్యారు.ఈసందర్భంగా కేంద్ర నిర్వాహకురాలు సునితను జీవన్‌ ‌రెడ్డి అడుగగా మేము క్వింటాలుకు మూడున్నర కిలోలు తరుగు తీస్తూ తూకం వేస్తున్నామని, మిల్లర్లు 6 కీలోలు తరుగు తీసినా మాట వాస్తవమేనని తెలుపడంతో నివ్వెర్రబోయిన జీవన్‌ ‌రెడ్డి కలుగజేసుకుని రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ తరుగు తీయడం దారుణమన్నారు.తేమశాతం వచ్చి 15 రోజులైనా తూకం వేయడం లేదని, లారీలు లేవని సాకుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మీరే న్యాయం చేయాలని జీవన్‌ ‌రెడ్డి ముందు రైతులు గోడు వెల్లబోసుకున్నారు. ఈసందర్భంగా జీవన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ లారీలోడ్‌ ‌ను దర్మకాంట ద్వారా తూకం వేసిన రశీదును నిర్వాహకులకు ఇవ్వకుండా మిల్లర్లు రైతులను నిలువు దోపి డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్ప తాలు పేరుతో రైతులను మిల్లర్లు, కేంద్ర నిర్వాహకులు రైతులను నిలువు దోపిడి చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

తేమశాతం వచ్చి వారంరోజుల తర్వాత తూకం వేస్తే 5కి లోల నష్టం తోపాటు, తప్పతాలు, మిల్లర్ల మూలంగా 5 నుంచి 9కిలోల తరుగు తీయడంతో జగిత్యాల జిల్లాలో రూ.40 కోట్ల మేర మిల్లర్లు రైతుల నుంచి దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగిత్యాలలో 4 లక్షల మెట్రిక్‌ ‌ట న్నుల వరి ధాన్యం వస్తుందని అధికారులు పేర్కొంటుండగా ఇప్పటికీ 65 శాతం మాత్రమే కొనుగోలు చేశారని మిగతా ధాన్యం కొనుగోలు చేయాలంటే 15 రోజులు పట్టె అవకాశం ఉందని అకాల వర్షాలు పడితే నష్టాన్ని ఎవరు భరించాలని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈవిషయమై జిల్లా అదనపు కలెక్టర్‌ ‌రాజేశంతో మాట్లాడిన జీవన్‌రెడ్డి వెంటనే కొనుగోలు చేపట్ట డమే కాకుండా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయా లని డిమాండ్‌ ‌చేశారు. ఎమ్మెల్సీ వెంట డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌, ‌జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్‌ ‌రెడ్డి, నాయకులు వేముల సుభాష్‌, ‌కరండ్ల ముందూ, చిట్ల విజయ్‌, ‌బ్రహ్మ చారీ, నర్సగౌడ్‌, ‌రాచర్ల మల్లయ్య, దుర్గాప్రసాద్‌లు ఉన్నారు. జీవన్‌రెడ్డి ఫోన్‌లో ఇక్కడ జరుగుతున్న తీరును వివరించడంతో హుటా హుటినా అదనపు కలెక్టర్‌ ‌చిన్నాపూర్‌ ఐకేపి కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్లు జరిగేలా చర్యలు చేపట్టారు.

 

Leave a Reply