Take a fresh look at your lifestyle.

భవన నిర్మాణ అనుమతులు ఇక సులభతరం

సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌చాలు.. అన్‌లైన్లోనే అనుమతులు జారీ : మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌బోగ శ్రావణి
భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్‌ ఆధారిత అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేస్తు రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌-‌బి పాస్‌ ‌యాప్‌ను ప్రవేశపెట్టిందని దీంతో కార్యాలయాల చుట్టు తిరిగే అవసరం లేకుండానే ఇంటి నిర్మాణ అనుమతులు పొందవచ్చని జగిత్యాల మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌బోగ •శ్రావణి తెలిపారు. శుక్రవారం మున్సిపల్‌ ‌కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చైర్మన్‌ ‌మాట్లాడారు. సిఎం కేసిఆర్‌, ‌మంత్రి కేటిఆర్‌ల కృషితో ఎలాంటి అవినీతి అస్కారం లేని విధంగా ఇంటి నిర్మాణ అనుమతులు పొందేందుకు టిఎస్‌-‌బి పాస్‌ ‌యాప్‌ను ప్రవేశపెట్టారన్నారు. ఆన్‌లైన్‌ ‌ద్వారా ఈయాప్‌లో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకొని సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ఇస్తే ఇంటి వద్దకే నిర్మాణ అనుమతి వస్తుందని చైర్మన్‌ ‌తెలిపారు. కొత్త మున్సిపాలిటి చట్టంను అనుసరించి 75 చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరంలేదని అయితే అన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ ‌చేసుకొని కేవలం ఓక రూపాయి ఫిజు రూపంలో చెల్లిస్తే చాలన్నారు. 2 వందల చదరపు మీటర్ల లోపు విస్తిర్ణంలోని నిర్మాణపు భవనపు ఎత్తు 7 మీటర్ల వరకు ఉండే నివాస భవనాలకు తక్షణమే అనుమతి ఇస్తారన్నారు. 5 వందల మీటర్ల విస్తిర్ణం ఉండి 10 మీటర్లకు మించి ఎక్కువ ఎత్తు ఉన్న నివాసేతర భవనాలకు సింగిల్‌ ‌విండో పద్దతిలో స్వికరించిన దరఖాస్తులను పరిశీలించి 21 రోజులలో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరగుతుందన్నారు.

ఓక వేళ 21 రోజులలో అనుమతి రానిచో అనుమతి వచ్చినట్లే పరిగనలోకి వచ్చి అనుమతి పత్రం అటోమెటిక్‌గా ధరఖాస్తు దారునికి ఇవ్వడం జరగుతుందన్నారు. ధరఖాస్తు దారులు ఓప్పంద పత్రం ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని అతిక్రమించి నిర్మానాలను చేపడితే ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా కూల్చివేసేలా చట్టంలో రూపోందించారన్నా రు. పొందిన అనుమతికి మించి ముందుకు వచ్చి నిర్మించుకునే కట్టడాల విషయంలో ఆభూమి రిజిస్ట్రేషన్‌ ‌చార్జీలలోని భూమి విలువలో 25 శాతం అపరాద రుసుముగా విధించడం జరగుతుందని లేకుంటే ఎలాంటి నోటిసులు ఇవ్వకుండానే అ కట్టడాన్ని కూల్చి వేయడం జరగుతుందని చైర్మన్‌ ‌హెచ్చరించారు. ఈ నూతన భవన నిర్మాణాల అనుమతి ప్రక్రియ ఎప్రిల్‌ 2 ‌నుంచి ప్రారంభమైనా కరోనా వైరస్‌ ‌మూలంగా ఈనెల 2 నుంచి ప్రారంబించడం జరిగిందన్నారు. తొలి అనుమతిని ఓ డెవలపర్‌ ‌పొందారని మిగతా పట్టణ ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌బోగశ్రావణి కోరారు. ఈకార్యక్రమములో మున్సిపల్‌ ‌కమీషనర్‌ ‌జయంత్‌రెడ్డితోపాటు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఉన్నారు.

Leave a Reply