Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌(‌దోస్త్) ‌విడుదల

రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ ‌నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. అర్హత కలిగిన విద్యార్థులు జులై 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవొచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జులై 3 నుంచి 16వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్స్ ఇచ్చుకోవొచ్చు. జులై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23వ తేదీ నుంచి జులై 27వ తేదీ వరకు సెల్ఫ్ ‌రిపోర్టు చేయాలి. బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్‌, ‌బీకాం హానర్స్, ‌బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యామండలిలో నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ‌ప్రొ.పాపి రెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌నవీన్‌ ‌మిత్తల్‌, ‌మండలి వైస్‌ ‌ఛైర్మన్‌-‌దోస్త్ ‌కన్వీనర్‌ ‌ప్రొ.లింబాద్రి, మండలి వైస్‌ ‌ఛైర్మన్‌ ‌ప్రొ.వెంకట రమణ, మండలి సెక్రెటరీ శ్రీనివాస రావు, డా.ఘనశ్యామ్‌, ‌రవిచంద్ర, విజయ రెడ్డి, డా. వసుంధర పాల్గొన్నారు.

Leave a Reply