Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా

  • నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌
  • ‌వరంగల్‌, ‌ఖమ్మం కార్పొరేషన్లు..ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు
  • ఏప్రిల్‌ 30‌న పోలింగ్‌…‌మే3న కౌంటింగ్‌
  • ‌నేటి నుంచి 18వ తేదీవరకు నామినేషన్ల స్వీకరణ
  • ఉపసంహరణకు 22 వరకు గడువు
  • రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రంలో మినీ పురపోరుకు రంగం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. వరంగల్‌, ‌ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ ‌మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్‌ ‌జరగనుంది. ఎన్నికలకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఏప్రిల్‌ 30‌న పోలింగ్‌ ‌జరగనుండగా.. మే 3న కౌంటింగ్‌ ‌జరగనుంది. శుక్రవారం 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు ఏప్రిల్‌ 18 ‌తుది గడువు కాగా నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ గడువుగా విధించారు. మొత్తం రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఖమ్మం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ముగిసిన అనంతరం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పురపోరుకు సిద్ధమవుతాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న అభ్యర్థుల నామినేషన్‌ ‌పత్రాలను పరిశీలించనున్నారు. జడ్చర్ల, నకిరేకల్‌, ‌కొత్తూరు చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జడ్చర్ల – బీసీ మహిళ, నకిరేకల్‌ – ‌బీసీ జనరల్‌, ‌కొత్తూరు -జనరల్‌ ‌మహిళకు కేటాయించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు లాటరీ తీశారు.

ఇక వరంగల్‌, ‌ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్ల జాబితాను సంబంధిత అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వరంగల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో 66, ఖమ్మం కార్పొరేషన్‌ ‌పరిధిలో 60 డివిజన్లకు, సిద్దిపేటలో 43 వార్డులకు, అచ్చంపేటలో 20, జడ్చర్లలో 27, కొత్తూరులో 12 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు వివిధ కారణాలతో ఖాళీ అయిన గజ్వేల్‌ ‌మున్సిపాలిటీలోని 12వ వార్డుకు, నల్లగొండ మున్సిపాలిటీలోని 26వ వార్డుకు, జల్‌పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డుకు, అలంపూర్‌ ‌మున్సిపాలిటీలోని 5వ వార్డుకు, బోధన్‌ ‌మున్సిపాలిటీలోని 18వ వార్డుకు, పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డుకు, మెట్‌పల్లి మున్సిపాలిటీలోని 8వ వార్డుకు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 30వ వార్డుకు, జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Leave a Reply