Take a fresh look at your lifestyle.

నీట్‌ ‌పీజీ డెంటల్‌ ‌కోర్సులకు నోటిఫికేషన్‌

12‌న ముగియనున్న ఆన్‌లైన్‌ ‌గడువు
నీట్‌ ‌పీజీ డెంటల్‌ ‌కోర్సులో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ ‌వర్సిటీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. పీజీ డెంటల్‌ ‌కటాఫ్‌ ‌మార్కులు తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నీట్‌ 2020-2021 ‌పీజీ అర్హత కటాఫ్‌ ‌స్కోర్‌ను 18.935 పర్సంటైల్‌ ‌తగ్గించింది.

దీని ప్రకారం జనరల్‌ అభ్యర్థులు 31.065 పర్సంటైల్‌ 220 ‌మార్కులు, ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ కోటాలో 21.065 పర్సంటైల్‌ 188 ‌మార్కులు, దివ్యాంగులు 26.065 పర్సంటైల్‌ 204 ‌మార్కులు సాధించిన వారు అర్హులని అని తెలిపింది. ఈ సీట్లను కన్వీనర్‌ ‌కోటాలో భర్తీ చేస్తున్నామని, ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు ఈ నెల 12న గడువు ముగుస్తుందని వెల్లడించింది. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ ‌లో చూడవచ్చని పేర్కొంది.

Leave a Reply