Take a fresh look at your lifestyle.

‌పలు విద్యాసంస్థలకు నోటీసులు కరోనాపై సర్కార్‌ ఆదేశాలు బేఖాతర్‌

‌నగర వాసులను భయాందోళనకు గురిచేస్తున్న కరోనావైరస్‌ ‌వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం పాఠశాలలను మూసివేయాలని ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘిస్తూ కొన్ని ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఈవిషయం పై ఇప్పటికే సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం ఆయా విద్యాసంస్థల తనిఖీ కోసం స్పెషల్‌స్క్వాడ్‌లను నియమించింది.

ఈసందర్భంగా నగరంలోని పలు విద్యాసంస్థలపై తనిఖీలు నిర్వహించిన స్పెషల్‌స్క్వాడ్‌ ‌కొన్నివిద్యాసంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో చార్మినార్‌,‌సైదాబాద్‌, ‌బహదూర్‌పురాలోని స్ప్రిగ్‌ఫీల్డ్ ‌స్కూల్‌, ‌సికింద్రాబాద్‌లోని షిరీన్‌ ‌పబ్లిక్‌స్కూల్‌, ‌షేక్‌పేటలోని ఖుష్బూ స్కూల్‌, ‌జోశ్వాస్కూల్‌, ‌సైన్‌రైస్‌స్కూల్‌, ‌గన్‌ఫౌండ్రీలోని రోసరీ కాన్వెంట్‌స్కూల్‌, ఆల్‌సెయింట్స్ ‌హై స్కూల్‌, అబిడ్స్‌లోని లిటిల్‌ ‌ప్లవర్‌ ‌స్కూల్‌, ‌బహదూర్‌పురాలోని సెయింట్‌మార్కస్ ‌బాయల్స్ ‌టౌన్‌స్కూల్‌కు నోటీసలు చేసినట్టు విద్యాశాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags: Charminar, Saidabad, Springfield School in Bahadurpura, Shirin Public School in Secunderabad, Khushboo School, Shakespeare

Leave a Reply