Take a fresh look at your lifestyle.

వోటు…నోటు !?

దళిత బందుకు బ్రేక్‌
ఏ ‌పార్టీకో అది షాక్‌

‌రాజకీయ గడబిడ
కారు, కమలం రగడ
గెలుపు పై దడదడ

‘‘హు..బాద్‌’ ఏమంటున్నది
అందరి మాట వింటున్నది

జెండాలను చూస్తున్నది
గుంభనంగా కనిపిస్తున్నది

వోటు రేటు భారీగా పెరిగింది
డబ్బు చేతికొచ్చి పడుతున్నది

నోటు..వోటును శాసిస్తుందా!?
వోటు..ఆయుధమై జ్వలిస్తుందా!?
– కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply