Take a fresh look at your lifestyle.

గోడలు కాదు.. వారధులు నిర్మించండి

రైతుల ఉత్యమంతో ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితులపై రాహుల్‌ ‌గాంధీ
రైతు నిరసన ఉధృతంగా కొనసాగుతున్న ప్రదేశాల్లో కాంక్రీటుతో బారీకేడ్లు నిర్మించడంపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడలు కాదు వారధులు నిర్మించండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఓవైపు రైతుల నిరసన, మరోవైపు పోలీసుల బందోబస్తుతో ఢిల్లీ సరిహద్దులు కోటలుగా మారుతున్నాయి. ప్రధాన రహదార్లపై ఆరు-ఏడు అంచెల బారీకేడ్లు వేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ వీటినేవీ అధికారంలో ఉన్నవారు పట్టించుకోవడం లేదన్నారు.

ఢిల్లీ సరిహద్దులో పోలీసుల ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న కాంక్రీట్‌ ‌భారీకేడ్ల చిత్రాలను తన ట్విట్టర్‌ ‌ఖాతాలో షేర్‌ ‌చేసిన రాహుల్‌ ‌గాంధీ ఈ విధంగా ట్వీట్‌ ‌చేశారు. ట్వీట్‌కు ముందు మోదీ ప్రభుత్వానికి చెబుతున్నట్లుగా ‘భారత ప్రభుత్వం’ అని రాసుకొచ్చారు. ఢిల్లీ-హర్యానా, ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో భద్రతా బలగాల సంఖ్య పెద్ద స్థాయిలో పెరిగింది.

- Advertisement -

జనవరి 26 విధ్వంసం అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకు ముందు రైతు నిరసనపై అసంతృప్తిని కూడా వ్యక్తం చేయలేని పరిస్థితుల మధ్య ప్రభుత్వం ఉంది. అయితే ఎర్రకోట ఘటనతో రైతులను నిరసన ప్రదేశం నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలకు ప్రభుత్వం పూనుకుంది.

Leave a Reply