Take a fresh look at your lifestyle.

తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు.. పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నా

  • ఏదైనా చెప్పాలనుకుంటే మీడియా ద్వారా కాదు..నిజాయితీగా నాతో చెప్పండి
  • పార్టీకి పూర్వ వైభవం రావాలని నేతలందరూ కోరుకుంటున్నారు
  • అందుకు ఐక్యత, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ అవసరం
  • సిడబ్ల్యుసి సమావేశంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ
  • అధ్యక్షుడిగా రాహుల్‌ ఉం‌డాలని కోరాం..అందరిదీ ఒకే మాట: అంబికా సోనీ

మీడియా ద్వారా నాయకులు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నిజాయితీగా చర్చించండి’ అని సోనియా గాంధీ అన్నారు. ఆమె  శనివారం జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలో ఒక స్పష్టమైన సందేశం ఇస్తూ తాను పూర్తి స్థాయి పార్టీ అధ్యక్షురాలినని, ఆ విధంగానే బాధ్యతలు నిర్వహిస్తున్నానని నొక్కిచెప్పారు. గతంలో మా పార్టీలో ప్రస్తుతం అధ్యక్షుడు లేరని సీనియర్‌ ‌నాయకుడు కపిల్‌ ‌సిబల్‌ ‌చేసిన వ్యాఖ్యలను, పార్టీని పునరుద్ధరించడానికి శాశ్వత అధ్యక్షుడి అవసరమని శశి థరూర్‌ ‌వంటి సీనియర్‌ 23 ‌మంది సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె ప్రత్యక్షంగా తిపికొట్టారు. పార్టీకి పూర్వ వైభవం రావాలని నేతలందరూ కోరుకుంటున్నారని, అయితే అందుకు ఐకమత్యం అవసరమని, పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం ముఖ్యమని తెలిపారు. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ మరీ ముఖ్యమని చెప్పారు. ఈ ఏడాది జూన్‌ 30 ‌నాటికి రెగ్యులర్‌ ‌కాంగ్రెస్‌ ‌చీఫ్‌ను ఎన్నుకునేందుకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌వల్ల ఈ పక్రియను నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. సంస్థాగత ఎన్నికల గురించి పూర్తి స్పష్టత ఇచ్చే సందర్భం వొచ్చిందని చెప్పారు. తాను పూర్తి కాలం పని చేసే, చురుగ్గా వ్యవహరించే కాంగ్రెస్‌ అధ్యక్షురాలినని తెలిపారు. తాను నిజాయితీని ఇష్టపడతానని, తనకు ఏదైనా చెప్పాలనుకుంటే, వి•డియా ద్వారా తనతో మాట్లాడవలసిన అవసరం లేదని సోనియా గాంధీ తెలిపారు.  మనమంతా కలిసి స్వేచ్ఛగా, నిజాయితీగా చర్చించుకుందామన్నారు.

ఈ గది నాలుగు గోడల వెలుపల తెలియజేయవలసినది సీడబ్ల్యూసీ సమష్టి నిర్ణయమని చెప్పారు. గత రెండు సంవత్సరాలలో, పెద్ద సంఖ్యలో యువ సహోద్యోగులు పార్టీ విధానాలు మరియు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకత్వ పాత్రలు పోషించారని ఆమె పేర్కొన్నారు.  సమావేశంలో కాంగ్రెస్‌ ‌నేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌ ‌గెహ్లాట్‌ (‌రాజస్థాన్‌), ‌భూపేష్‌ ‌బాఘెల్‌(‌ఛత్తీస్‌గఢ్‌), ‌చరణ్‌జిత్‌ ‌చన్ని(పంజాబ్‌) ‌సహా 57 మంది నేతలు పాల్గొనగా, అనారోగ్యం కారణంగా మన్మోహన్‌ ‌సింగ్‌ ‌హాజరుకాలేక పోయారు. సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాలని అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌ప్రతిపాదించగా కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సభ్యులందరూ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ విదేశాంగ విధానం ఎన్నికల సమీకరణకు సాధనంగా మారిందని, మనం సరిహద్దులలో, ఇతర రంగాలలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని అన్నారు.

మన దేశంలో విదేశీ మరియు పొరుగు విధానంపై ఎల్లప్పుడూ విస్తృత ఏకాభిప్రాయం ఉందని, కానీ అర్థవంతమైన రీతిలో ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకువెళ్లడానికి ప్రధాని నిరంతరం విముఖత చూపడం వల్ల ఏకాభిప్రాయం దెబ్బతిన్నదని సోనియా గాంధీ అన్నారు. తాము చివరిసారిగా కలిసిన తర్వాత భారత ప్రభుత్వం దాని టీకా సేకరణ విధానాన్ని మార్చిందని, రాష్ట్రాల డిమాండ్లకు ప్రతిస్పందనగా ఇది జరిగిందని, రాష్ట్రాలు ఆ విధానాన్ని ఆచరించి దేశానికి ప్రయోజనం చేకూర్చిన అరుదైన సందర్భాలలో ఇది ఒకటని అన్నారు. అయినప్పటికీ, సహకార ఫెడరలిజం ఒక నినాదం మాత్రమేనని, బిజెపియేతర రాష్ట్రాలను నష్టపరిచే అవకాశాన్ని కేంద్రం కోల్పోదని అన్నారు. ఇప్పుడు సమావేశంలో పాల్గొన్న వారందరూ రెండు డోసుల టీకాలు వేయించుకున్నందున తాము మా మాస్కులతో భౌతికంగా కలవాలని నిర్ణయించుకున్నామని సోనియా గాంధీ తెలిపారు. ప్రభుత్వ రంగం కేవలం వ్యూహాత్మక, ఆర్థిక లక్ష్యాలను మాత్రమే కలిగి లేదని, షెడ్యూల్డ్ ‌కులాలు మరియు షెడ్యూల్డ్ ‌తెగల సాధికారత మరియు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి సామాజిక లక్ష్యాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి గొప్పగా ఉందని తమకు నమ్మకం కలిగించేలా ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవంగా ఆందోళన కలిగిస్తుందని సోనియా గాంధీ అన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ ‌నాయకుడు గులాం నబీ ఆజాద్‌ ‌మాట్లాడుతూ సోనియా గాంధీపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆమె నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని అన్నారు. ఈ రోజు ఒకసారి స్పష్టత తీసుకురావాల్సిన సందర్భమని ఆయన అన్నారు. పూర్తి స్థాయి సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ‌సమావేశం ముందు ఉందని, అంతర్గత ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని సోనియా గాంధీ చెప్పారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, కొత్త పార్టీ చీఫ్‌తో సహా కొత్త ఆఫీస్‌ ‌బేరర్‌లను ఎన్నుకోవడానికి సెప్టెంబర్‌ 2022 ఎన్నికల షెడ్యూల్‌ని పార్టీ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

అధ్యక్షుడిగా రాహుల్‌ ఉం‌డాలని కోరాం.. అందరిదీ ఒకే మాట: అంబికా సోనీ
కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ ‌గాంధీ ఉండాలని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు అంబికా సోనీ తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆమె వి•డియాతో మాట్లాడారు. రాహుల్‌ ‌పార్టీ అధ్యక్షుడు కావాలన్నది అందరి అభిప్రాయమని సోనీ చెప్పారు. అయితే అధ్యక్ష పదవిని చేపట్టాలా వద్దా అన్నది ఆయనే నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలో ఎక్కడా కూడా జీ-23 (పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన 23 మంది సీనియర్లు) ప్రస్తావన రాలేదని అంబికా సోనీ తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీ వర్గాలుగా విడిపోలేదన్న ఆమె, తామంతా ఐక్యంగా ఉన్నామన్నారు. రాహుల్‌ ‌గాంధీ పార్టీ అధ్యక్షుడు అవ్వాలని భారత జాతీయ కాంగ్రెస్‌ ‌నాయకులందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారని అంబికా సోనీ తెలిపారు. 2022 సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పక్రియ జరుగుతుందని ఆమె చెప్పారు

Leave a Reply