సూర్యాపేటకు చెందిన వీరజవాన్ కల్పల్ సంతోష్‌బాబుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటి బుదవారం ఘన నివాళులర్పించింది. జిల్లా కాంగ్రెస్ కమిటి కార్యాలయం సంజీవరెడ్డిభవన్లో జరిగిన సమావేశంలో కల్నల్ సంతోష్‌బాబు చిత్రపటానికి డిసిసి అద్యక్షుల పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కమిటి అద్యక్షులు ఎండి జావీద్‌లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చైనా హద్దుమీరి భారత భూబాగంలోకి రావటం మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. అయినా ఎంతో ఓర్పుగా వ్యవహరిస్తున్న మన సైన్యంపై రాళ్లు, కర్రలతో దాడులు చేయడం అందులో 20మంది భారత సైనికులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ చర్యను జిల్లా కాంగ్రెస్ తరపున తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ల కుటుంబసభ్యులకు డిసిసి ప్రగాడ సానుభూతిని తెలియజేస్తుందన్నారు. వారి కుటుంబాలకు ఎల్లపుడూ అండగా ఉంటుందన్నారు. వీరమరణం పొందిన జవాన్ల ఆత్మలకు శాంతికలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు యర్రం బాలగంగాధరతిలక్,వడ్డెబోయిన నరసింహారావు, నాయకులు మిక్కిలినేని నరేందర్, ఎండి తాజుద్దీన్, చోటా బాబా,యడ్లపల్లి సంతోష్ శ్రీనివాస్,ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట, జూన్17 (ప్రజాతంత్ర విలేకరి) దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృథా కావని, దేశం వాటిని తప్పక గుర్తు పెట్టుకుంటుందని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్క భారతీయుడు కంకనబద్దుడైతారని బిజేపి పార్టీ జిల్లా కార్యదర్శి సింగిల్ విండో డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వరచారి అన్నారు. కల్నల్ ర్యాక్ అధికారి బిక్కుమల్ల సంతోష్ బాబు లడాక్ సరిహద్దుల్లో చైనా సైనికులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలర్పించిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన భారతమాత ముద్దుబిడ్డ సంతోష్ బాబు వీర జవాన్ కు రామన్నపేట సుభాష్ సెంటర్లోలో పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము యాదయ్య, బిజెపి నాయకులు కట్కూరి భిక్షపతి, చిందం లింగయ్య, బేతు శ్రీనివాస్, చిన్నపాక స్వామి, రాపోలు రాజశేఖర్, ఏలూరి రవి, బైరబోయిన రమేష్, వూటుకూరి మల్లేశం, గుండాల అంజయ్య, కునూరు సుధాకర్, జయారపు రామకృష్ణ, వివిధ పార్టీల నాయకులు సాల్వేరు అశోక్, గంగాపురం యాదయ్య, గట్టు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.