Take a fresh look at your lifestyle.

ఉద్యమంలో పాల్గొనకుంటే తెలంగాణ మీద ప్రేమలేదని కాదు

“ఆనాడు తెలంగాణ ఉద్యమం తీవ్రరూపంలో ఉంది. అయినా ఏనాడు తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు విషయంపై ఒక్కమాట కూడా మాట్లాడని షర్మిల ఇప్పుడు మాత్రం తాను తెలంగాణానికి చెందినదాన్నేనంటూ జై తెలంగాణ.. జైజై తెలంగాణ నినాదాలు చేస్తుంది. ఆమె తల్లి విజయమ్మతో కలిసిచేసిన ఈ పర్యటనలో ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యమకారుల విషయంలో మాత్రం విచారం వ్యక్తచేయడం తప్ప మరోమాటలేదు. వైఎస్‌ఆర్‌కు అన్ని ప్రాంతాల ప్రజల పట్ల సమాన ప్రేమ, అభిమానముందన్న మాటలతో ఆనాడు యాత్రను కొనసాగించారు. నేడు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ ‌మరణించి దశాబ్దకాలం గడిచినా ఇంకా ఆయన్ను ఇక్కడి ప్రజలు మరిచిపోలేక పోతున్నారని, అందుకు ఆయన అన్నివర్గాల ప్రజల కోసం చేపట్టిన పథకాలే కారణమన్న ప్రచారంతో ముందుకు పోతుంది షర్మిల.”

ఉద్యమంలో పాల్గొననంత మాత్రాన తనకు తెలంగాణ మీద ప్రేమలేదని కాదు. పుట్టింది, పెరిగింది, విద్యనార్జించింది అంతా తెలంగాణలోనే, నా పిల్లలు కూడా ఇక్కడేపుట్టారు. నా భర్త తెలంగాణ వాడైనప్పుడు నేను తెలంగాణ కోడలిని ఎలా కాకుండాపోతా? అందుకే నాకు తెలంగాణలో పార్టీ పెట్టే హక్కు ఉంది. కెసిఆర్‌, ‌విజయశాంతి ఎక్కడివారు. తమిళనాడు కాని జయలలిత అక్కడి రాజకీయాలను ఎలా శాసించిందంటూ తెలంగాణ రాజకీయాలకు తాను ఎలాంటిహక్కుదారన్న విషయాన్ని వెల్లడిస్తుంది ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి కూతురు, పక్క తెలుగు రాష్ట్రమైన ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల. ‘జగనన్నతో కొన్ని అభిప్రాయ భేదాలు తప్ప మాకెలాంటి పొరపొచ్చాలులేవు. అన్నా చెల్లెళ్ళ అనుబంధంలో ఎలాంటి తేడాలేదు. అక్కడ ఆయన (వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి) హాయిగా పాలన చేసుకుంటున్నాడు. ఇక్కడ (తెలంగాణరాష్ట్రంలో) ప్రజలు అశాంతితో బతుకుతున్నారు.

మహానేత వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఇక్కడ అనేకమంది ప్రాణాలు విడిచారు. వారందరినీ ఆదుకోవాల్సి ఉంది. వోదార్చాల్సి ఉంది. అంతేకాదు, తెలంగాణ సమాజాన్ని బాగుపర్చాలన్న ఉద్దేశ్యంగానే ఇక్కడ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం. రాష్ట్రంలో సమసమాజం ఏర్పడాలని తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. వారి నిరీక్ష ఫలించాలంటే మరో కొత్తపార్టీ ఆవిర్భావం అవసరం. అయితే వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి తోక పార్టీ కాకుండా ఇండిపెండెంట్‌గానే పార్టీ ఏర్పాటు చేస్తాం. రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉంటే తెలంగాణ మొదటి నుండి కొట్లాడుతున్న నిధులు, నీళ్ళు, నియామకాల విషయాలపై ఎలా పోరాటం చేస్తాం. తెలంగాణలో మరిన్ని రాజకీయ పార్టీల అవిర్భావానికి అవకాశముంది. ఎందుకంటే వారికి జరిగే అన్యాయాల గురించి పోరాడాల్సిన నాయకుల అవసరం ఇక్కడ ఎంత్తైనా ఉంది. తెలంగాణ ఏర్పడిన ఈ ఆరేళ్ళుగా ఇక్కడి రైతులు సంతోషంగా లేరు. విద్యార్దులు, నిరుద్యోగులంతా అసంతృప్తిగానే ఉన్నారు.

వైఎస్‌ఆర్‌ ‌ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ అందరికీ అందుబాటులోకి రావడం లేదు’ అంటూ గత కొద్ది రోజులుగా తెలంగాణలో షర్మిల చేస్తున్న ప్రసంగాల సారాంశమిది. తెలంగాణ ఏర్పడడానికి రెండు సంవత్సరాల ముందు వైఎస్‌ఆర్‌ ‌జగన్‌ ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పక్షాన మరో ప్రస్థానంపేర సీమాంధ్రతోపాటు తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలను చుట్టబెట్టింది షర్మిల. ఆనాడు తెలంగాణ ఉద్యమం తీవ్రరూపంలో ఉంది. అయినా ఏనాడు తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు విషయంపై ఒక్కమాట కూడా మాట్లాడని షర్మిల ఇప్పుడు మాత్రం తాను తెలంగాణానికి చెందినదాన్నేనంటూ జై తెలంగాణ.. జైజై తెలంగాణ నినాదాలు చేస్తుంది. ఆమె తల్లి విజయమ్మతో కలిసిచేసిన ఈ పర్యటనలో ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యమకారుల విషయంలో మాత్రం విచారం వ్యక్తచేయడం తప్ప మరోమాటలేదు. వైఎస్‌ఆర్‌కు అన్ని ప్రాంతాల ప్రజల పట్ల సమాన ప్రేమ, అభిమానముందన్న మాటలతో ఆనాడు యాత్రను కొనసాగించారు. నేడు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ ‌మరణించి దశాబ్దకాలం గడిచినా ఇంకా ఆయన్ను ఇక్కడి ప్రజలు మరిచిపోలేక పోతున్నారని, అందుకు ఆయన అన్నివర్గాల ప్రజల కోసం చేపట్టిన పథకాలే కారణమన్న ప్రచారంతో ముందుకు పోతుంది షర్మిల. ఇప్పుడు తెలంగాణలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువొచ్చేందుకే ఇక్కడ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతోంది.

- Advertisement -

ఏదేమైనా షర్మిల రాజకీయరంగ ప్రవేశం తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదపుతోందన్నమాట నిజం. ఎదుగుతున్న బిజెపిని తట్టుకోవడానికి కెసిఆర్‌ ఆలోచనలో భాగమే షర్మిల రాజకీయరంగ ప్రవేశమని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఒకరిద్దరు తప్ప ఆపార్టీ వర్గాలు కక్కలేక మింగలేకున్నారు. షర్మిల పార్టీతో ఎక్కువ నష్టపోయేది కాంగ్రేసన్నది అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికల నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్‌ ఇక్కడ కోల్కోలేకపోతున్నది. ఆ పార్టీకి చెందిన పలువురు ఇప్పటికే వలసబాట పట్టారు. మిగిలిన వారిలో వైఎస్‌ఆర్‌ అభిమానులు, అధిష్టానంపై అలుకగా ఉన్నవారు, ఉన్నత పదవులకోసం ఏళ్ళకొద్ది ఎదురుచూస్తున్నవారు, టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలోకి పోవడానికి మనస్కరించనివారు షర్మిల కొత్తగా ఏర్పాటుచేసే పార్టీలోకి మారవొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే దేశంలో విప్లవాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరముందని అందుకు కాంగ్రెస్‌, ‌బిజెపియేతర రాజకీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు ఇప్పుడు స్వంత రాష్ట్రంలోనే కొత్తకుంపటి మొదలైంది. ఈ కొత్తపార్టీకి రూపకర్త బిజెపి అని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తుండగా, కొత్తపార్టీలు నిలబడలేవన్న ఒక్క మాట తప్ప ఇప్పటివరకు కెసిఆర్‌ ఈ ‌విషయంలో పెద్దగా స్పందించినట్లు లేదు. కాగా, తాను పెట్టబోయే కొత్తపార్టీకి తన తండ్రిలాగానే చేవెళ్ళలోనే శ్రీకారం చుట్టే ఆలోచనలో షర్మిల ఉంది. ఆక్కడ ఏర్పాటుచేసే బహిరంగ సభలో పార్టీ ప్రస్థానాన్ని ప్రకటించడంతోపాటు, 2023 ఎన్నికలకుగాను ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది.

manduva ravindhar roa
మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply