Take a fresh look at your lifestyle.

*పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!*

సామాజిక దూరాన్ని (Social distancing) పాటించాలనే నినాదం సామాజిక ఐక్యత (social unity) ని విచ్చిన్నం చేయడానికి కారణం కాకుండా జాగ్రత్త పడదాం. కరోనా మహమ్మారిపై యుద్ధంలో సామాజిక ఐక్యత (social unity) ని ఒక బలమైన రక్షణ వ్యవస్థగా మార్చుకుందాం. ప్రగాఢ సామాజిక బంధాన్ని (strong social bonding) ని కరోనాపై యుద్ధంలో ఒక పదునైన ఆయుధంగా మార్చుకుందాం. మనుషుల శరీరాల మధ్య భౌతిక దూరాన్ని దృఢంగా పాటించాల్సిందే. అది ముమ్మాటికీ అవసరమైనది. ఆ సైంటిఫిక్
నియమం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. దానిని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు. అదేసమయం లో అది మనుషుల మధ్య మానసిక బంధాన్ని (mental bonding) విచ్చిన్నం చేయడానికి అవకాశం ఇవ్వరాదు. కరోనాని అరికట్టే లక్ష్యం తో చేపట్టే పనులు మనుషుల మధ్య మానసిక విభజనకూ లేదా విద్వేషాలకూ కారణం కారాదు. మనం పాటించే దూరాలు, కట్టుకునే గోడలు, వేసే ముళ్ళ కంచెలు కరోనా ని లక్ష్యం(target) గా చేసుకోవాలి. అంతేతప్ప, ఆ పేరిట చేసే పనులు మన ప్రజల మధ్య మానసిక దూరాల్ని పెంచరాదు. అవి మన మనుషుల మధ్య, ముఖ్యంగా మనస్సుల్లో అనవసరమైన అపోహలనూ, భయాలనూ సృష్టించరాదు. మనిషికీ మనిషికీ మధ్య అనవసర కృత్రిమ గోడల్ని సృష్టించకూడదు. ఇప్పుడు మనం తీసుకోవాల్సి జాగ్రత్తలివి.

ఈ ఆపద కాలంలో మనుషుల మధ్య మానసిక ఐక్యత (mental bonding) చాలా అవసరం. ఈ కష్టకాలంలో మనుషుల మధ్య మానసిక విభజన (mental division) రాకుండా తగు జాగ్రత్త పడదాం. మనుషుల శరీరాల మధ్య దూరాన్ని (physical distancing) కఠినంగా పాటించుదాం. మనుషుల మనసుల మధ్య సమైక్యత (mental unity) ను చాటుదాం. మామూలు సమయాలలో కంటే రెట్టింపు సమైక్యత నేడు మనమధ్య ఏర్పడాలి. కరోనా మహమ్మారి ని ఓడించడంలోనూ, తరిమికొట్టడం లోనూ నేడు భారతీయులుగా మనమంతా ఓకేత్రాటిపై ఐక్య శక్తిగా నిలబడాల్సి వుంది. మన ప్రజల మధ్య సామాజిక ఐక్యత (social unity), ప్రగాఢ సామాజిక బంధం (strong social bonding) నేడు మరింత ఎక్కువగా పెరగాల్సి ఉంది. మనుషుల మధ్య మానసిక బంధం (mental bonding) బలోపేతం చేసే లక్ష్యంతో ముందడుగు వేద్దాం. ఇది అందుకు తగు సందర్భమూ, సమయమూ! అందుకే భౌతిక దూరాన్ని మనం మరింత కఠినంగా పాటిద్దాం. అదేసమయంలో మరింత సామాజిక సమైక్యతని పెంచే స్పూర్తితో మాత్రమే పాటిద్దాం. తద్వారా కరోనా మహమ్మారిని నిశ్చయంగా , త్వరగా ఓడిద్దాం.

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
26-3-2020

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!