Take a fresh look at your lifestyle.

బిజెపితో ఎపికి ఒరిగిందేమి లేదు

లెఫ్ట్ ‌పార్టీల నేతలు రామకృష్ణ, మధు
బీజేపీ అధికారంలోకి వచ్చిన 7 ఏళ్ల కాలంలో ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రానికి ఏ రకమైన న్యాయం జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇచ్చిన హామిలను తుంగలో తొక్కిన ఘనుడు మోడీ అని మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మిడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలకు బీజేపీ దగా చేసిందని, విభజన హమిలు నేరవేర్చని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలన్న పవన్‌ ‌కల్యాణ్‌కు ఇప్పుడు ఆ లడ్డూలు కమ్మగా ఉన్నాయా? అని నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నికలో వంద కోట్ల అవినీతి డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని వైసీపీ మంత్రులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎయిర్‌ ‌పోర్టులు, ఒడరేవులను ఆదానికి కట్టబెట్డేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మధు ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ను తెగనమ్మాలనడం దారుణమన్నారు. ఆదానీ అంబానీలకు దేశ సంపదను కట్టబెట్టే కుట్రలో మోడీ ఉన్నారని మండిపడ్డారు. ప్రజలు బిజెపి కుట్రలను నిలదీయాలన్నారు. లేకుంటే నష్టపోయేది ప్రజలేనని అన్నారు. బిజెపి మోసాలను గుర్తించి తిరుపతిలో ఆ పార్టీకి డిపాజిట్‌ ‌రాకుండా చేయాలన్నారు.

Leave a Reply