Take a fresh look at your lifestyle.

రాజకీయం కోసం కాదూ…సర్వీస్‌ ‌కోసం

డబ్బులు లేనోళ్ల కోసమే ఈ ఉచిత అంబులెన్స్‌లు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
18కి చేరనున్న అంబులెన్స్‌ల సంఖ్య

హైదరాబాద్‌, ‌మే 28 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్‌ ‌పార్టీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి ఇప్పటికే గాంధీభవన్‌లో 3 ఉచిత అంబులెన్స్‌లను ప్రారంభించిన జగ్గారెడ్డి… ప్రస్తుతం 2 అంబులెన్స్‌ల(సంగారెడ్డికి)ను ప్రారంభించనున్నారు. త్వరలో మరో 13ఉచిత అంబులెన్స్‌లను ప్రారంభించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ప్రారంభించే అంబులెన్స్ ‌వాహనాలకు తుది మెరుగులుదిద్దించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే,  దానం చేసే గుణం అందరికీ ఉండదు.. తమ వద్ద డబ్బులు ఉన్నా.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారు చాలా అరుదు.

ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ ‌కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తున్న తరుణంలో ఇప్పటికే సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం  సొంత డబ్బులతో 70సిలిండర్లను  కొనుగోలు చేసి ఇచ్చిన ఆయన…మరికొన్నింటిని కొనే పనిలో ఉన్నాడు. మరోవైపు గాంధీభవన్‌ ‌కంట్రోల్‌ ‌రూంకు అంబులెన్స్‌లను ఉచితంగా ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం తొలుత 8అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలనుకున్నాడు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబులెన్స్‌ల కోసం బాధితులు పడుతున్న బాధలతో చలించిపోయిన ఆయన అదనంగా ఉచితంగా మరో 13అంబులెన్స్‌లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు. కోవిడ్‌ ‌బారినపడిన వారు అంబులెన్స్‌ల కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటువంటి వారి కోసం నేనున్నాంటూ ముందుకు వచ్చారు జగ్గారెడ్డి. అందులో భాగమే ఈ ఉచిత అంబులెన్స్‌ల ఏర్పాటు.

రాజకీయం కోసం కాదూ…సేవ కోసం…: జగ్గారెడ్డి
రాజకీయ లబ్ది కోసమో, మీడియాలో పబ్లిసిటి కోసమో తాను ఉచిత అంబులెన్స్ ‌సర్వీసులను ప్రారంభించడం లేదనీ, పూర్తిగా డబ్బులేని నిరుపేద ప్రజల కోసం మాత్రమే ఈ అంబులెన్స్‌లను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. నా తల్లితండ్రుల  గార్ల జ్ఞాపకర్ధంతో పాటు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు సోనియా గాంధీ,రాహుల్‌ ‌గాంధీ, ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి, మాణికం ఠాగూర్‌, ‌బోసురాజు  ఆదేశాల మేరకు   ప్రజల మనిషిగా మరీ ముఖ్యంగా సంగారెడ్డి శాసనసభ్యుడిగా  ఉచిత అంబులెన్స్ ‌సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి 2అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నానీ మొత్తంగా 15అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తాననీ అన్నారు.

త్వరలో మరో త్వరలో మరో 13 అంబులెన్స్‌లను అందుబాటులోకి తెస్తాననీ చెప్పారు. ప్రస్తుతానికి తల్లిదండ్రులైన జయాయమ్మ-జగ్గారెడ్డి జ్ఞాపకార్థకం సంగారెడ్డి టౌన్‌లో ఒకటి, సదాశివపేటలో ఒకటి అందుబాటులో ఉంచామన్నారు. అంబులెన్స్ అవసరమున్న వారు సంగారెడ్డి  క్యాంప్‌ ఆఫీస్‌ ‌నెంబర్‌ 08455-278355‌కు ఫోన్‌ ‌చేయాలని సూచించారు. పూర్తిగా 13అంబులెన్స్‌లను ఏర్పాటు చేయగానే  ఎవరిని కాంటాక్ట్ ‌కావాలో వారి ఫోన్లు నెంబర్లు చెబుతామన్నారు.  ఇది రాజకీయం కోసం కాదు చాలా రోజుల నుండి తల్లితండ్రుల  పేరు మీద సర్వీస్‌ ‌చేయాలన్న ఆలోచనలో భాగంగానే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పడొద్దని ఈ ఉచిత అంబులెన్స్ ‌సర్వీస్‌లను ప్రారంభిస్తున్నాననీ అన్నారు.  సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు ఉపయోగించుకోవాలనీ, ఈ అంబులెన్స్ ‌సర్వీస్‌ ‌పూర్తిగా ఉచితమేననీ అన్నారు.   పెట్రోల్‌, ‌డీజల్‌  ‌కూడా నేనే ఏర్పాటు చేస్తున్న.

ఒక్కరూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వీటి ఏర్పాటుతో  ప్రైవేట్‌ అం‌బులెన్స్ ‌సర్వీస్‌ ‌బిసినెస్‌ ‌దెబ్బతీయడానికి కాదనీ, డబ్బులు లేక ఇబ్బంది పడే పేద ప్రజల కోసం మాత్రమేనన్నారు.  డబ్బులు ఉన్నవారు ప్రైవేట్‌ అం‌బులెన్స్ ‌సర్వీస్‌ ఉపయోగిస్తారు, డబ్బులు లేనివారు నేను ఏర్పాటు చేసిన  ఉచిత అంబులెన్స్ ‌సర్వీస్‌లను ఉపయోగించుకుంటారనీ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌ ‌కంట్రోల్‌ ‌రూంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లను కలిపి మొత్తంగా జగ్గారెడ్డి ఏర్పాటు చేసే ఉచిత అంబులెన్స్‌ల సంఖ్య 18కి చేరనున్నది.

Leave a Reply