Take a fresh look at your lifestyle.

హెచ్‌ఐవి ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు…ఇమ్యునిటీ తగ్గితే వస్తుంది

“డిసెంబర్‌ 1 ‌ప్రపంచ ఎయిడ్స్ ‌దినం ఎయిడ్స్ ‌శరీర ద్రవాల ద్వారా అంటే రక్తం, వీర్యం, యోని ద్రవాలు, తల్లిపాల ద్వారా వ్యాపిస్తుంది. హెచ్‌ఐవి వైరస్‌ ‌మనుషులలో చేరిన వెంటనే రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధిగ్రస్తులు త్వరగా జలుబు తదితర అంటురోగాల బారిన పడతారు. అంతేకాక వ్యాధి నిరొధకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాధులు(ఆపర్చునిస్టిక్‌ ఇన్ఫెక్షన్స్) ‌పోటీ పడిరావటంతో అనారోగ్యానికి గురై వాడే మందులనే హెచ్‌ఐవి కాక్టెయిల్‌ అని లేదా ఫిక్స్‌డ్‌ ‌డోస్‌ ‌కాంబినేషన్‌ (ఇం‌దులో రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్‌ ‌గా ఉంటాయి) అని పిలిస్తారు. హెచ్‌ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు. మన శరీరం అద్భుతమైనది.”

ప్రపంచంలో రకరకాల వైరస్‌లు మానవ మనుగడకు అడ్డంకిగా మారి గమ్యంలేని జీవితాలలో తొంగిచుస్తూ వెక్కిరించడంతోసామాన్యుడి బతుకు ప్రశ్నార్థకంగా మారింది. మనిషి తినే తిండిలో క్రమంగా వస్తున్న మార్పుల ప్రభావంతో కొన్ని దశబ్దాలుగా రోగ నిరోధకశక్తి తగ్గి రకరకాల వ్యాధులతో సతమతమవుతున్నాడు. అందులో బాగంగానే ఒకప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడించిన మహామ్మారి ఎయిడ్స్ ‌బారిన పడి ఎందరో బుగ్గి పాలైనారు. ఎయిడ్స్ ‌శరీర ద్రవాల ద్వారా అంటే రక్తం, వీర్యం, యోని ద్రవాలు, తల్లిపాల ద్వారా వ్యాపిస్తుంది. హెచ్‌ఐవి వైరస్‌ ‌మనుషులలో చేరిన వెంటనే రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధిగ్రస్తులు త్వరగా జలుబు తదితర అంటురోగాల బారిన పడతారు. అంతేకాక వ్యాధి నిరొధకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాధులు(ఆపర్చునిస్టిక్‌ ఇన్ఫెక్షన్స్) ‌పోటీ పడిరావటంతో అనారోగ్యానికి గురై వాడే మందులనే హెచ్‌ఐవి కాక్టెయిల్‌ అని లేదా ఫిక్స్‌డ్‌ ‌డోస్‌ ‌కాంబినేషన్‌ (ఇం‌దులో రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్‌ ‌గా ఉంటాయి) అని పిలిస్తారు. హెచ్‌ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు. మన శరీరం అద్భుతమైనది. ప్రతీ రోజు అది మనం ముట్టుకునే, త్రాగే, ఊపిరి పీల్చుకొనే సూక్ష్మ జీవుల వల్ల కలుగే జబ్బుల నుండి ప్రత్యేక పద్ధతులలో కాపాడుతుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు.

అసలు హెచ్‌ఐవి అంటే ఏమిటి.?
హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్‌ను హెచ్‌ఐవి అని పిలుస్తారు. ఇది అత్యంత అంటు వ్యాధి, రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ప్రారంభ చికిత్స పొందవచ్చు. అందుకే దీని గురించి సాధారణ లక్షణాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ వ్యాధి ప్రారంభలో కొన్ని సంక్రమణ సంకేతాలను అందిస్తుంది. అప్పుడు నిర్ధారణ సులభం అవుతుంది. హెచ్‌ఐవిని పరీక్షించే విధానం ఇబ్బందికరంగా, కఠినంగా ఉంటుంది. అయితే నేడు హెచ్‌ఐవి పరీక్షలకు అనేక మార్గాలు ఉన్నాయి. హెచ్‌ఐవిని గుర్తించడానికి ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ సెంటర్‌లో తగిన సదుపాయాలు ఉన్నాయి. చికిత్స మరియు రోగుల రికార్డులను రహస్యంగా నిర్వహిస్తారు. ప్రారంభ చికిత్స తీవ్రత మరియు సంక్రమణ పురోగతి నివారించేందుకు అవసరం. హెచ్‌ఐవి సంకేతాలు వ్యాధి దశ మరియు దాని తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సోకిన వ్యక్తి యొక్క శరీరం ద్రవాల మార్పిడి ద్వారా ఇతరులకు వ్యాధి సంక్రమిస్తుంది.హెచ్‌ఐవి వైరస్‌ ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్‌ఐవి వైరస్‌ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ ‌వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్‌ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్‌ఐవి పాజిటివ్‌ అని సంభోదిస్తారు. హెచ్‌ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ ‌వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోధకత బాగా క్షీణించిందని తేలినప్పుడు. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ధ్రువపరుస్తారు.

ఎయిడ్స్ ఏ ‌విధంగా సంక్రమిస్తుంది..?
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ ‌వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా పరిగణించే వారు. కాని శక్తివంతమైన మందులు, ఏయిడ్స్ ‌వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్‌ ‌టెన్షన్‌ (‌రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే దీర్ఘకాలికంగా నియంత్రించటానికి వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. హెచ్‌ఐవి వై రస్‌ ‌మనుషలకు మాత్రమే సోకుతుంది.

హెచ్‌ఐవీ లక్షణాలు
జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా ) మొదలగునవి హెచ్‌ఐవి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు. ఒక్కోసారి మనిషి శరీరంలొ హెచ్‌ఐవి వైరస్‌ ‌ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందఝి• అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్‌ఐవి వైరస్‌ ‌చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్‌ ఐ ‌వి నుండి ఎయిడ్స్ ‌దశకు చెరుకోటానికి సాధారణంగా దాదాపు 10 సంవత్సరాలు  పడుతుంది.

అవగాహన అవసరం..
మనిషి వ్యాధి నిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది? ఏ ఏ ఆహారాలు మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి? హెచ్‌ఐవి అంటే ఏమిటి? ఎయిడ్స్ అం‌టే ఏమిటి? ఎవరికైనా హెచ్‌ఐవి ఉందని తెలిస్తే ఏమవుతుంది? ఎవరైనా ఎయిడ్స్ ‌బారిన పడితే ఏమవుతుంది? హెచ్‌ఐవి ఒకరినుంచి ఒకరికి ఏ విధంగా సంక్రమిస్తుంది? ఎలా సంక్రమించదు? మనం దాని నుండి ఎలా కాపాడుకోగలం? హెచ్‌ఐవికి చికిత్స ఏమిటి? హెచ్‌ఐవి తల్లుల నుండి పిల్లలకు సంక్రమిచకుండా మందులు ఏ విధంగా కాపాడతాయి? ఏంటి రెట్రో వైరల్‌ ‌థెరపీ ఎలా పనిచేస్తుంది? దానిని ఎప్పుడు వాడాలి? మన స్నేహాలు ఎప్పుడు మరియు ఎలా సంభోగానికి దారి తీస్తాయి? కండోమ్‌ను సరిగా ఎలా ఉపయోగించాలి? (మగ/ ఆడా) హెచ్‌ఐవి బారిన పడిన మన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి? అనే విషయాలపై మొహమాటం లేకుండా, ఏలాంటి సంకోచం లేకుండా తెలుసుకోవాల్సి అవసరం ఏంతైనా ఉంది.

Leave a Reply