చర్చలకని ఆహ్వానించి
అన్నల అడవి దాటించి
గుట్టు మట్లను పసిగట్టి
ఎందరెందరినో మట్టుబెట్టి
రక్తంతో చేతులు కడుక్కొన్న
విషపు నవ్వు పులుముకున్న
గదే! రాజన్న రాజ్యం! తెస్తోందట
అందుకే ఈడ మకాం పెడుతుందంట
తరిమి కొడితే పొలిమేర దాటిండ్లు
మళ్ళోచ్చి చూరుకు వేలాడుతాండ్లు
జల్ది జంగ్ సైరన్ మోగించాలే బిడ్డ!!
మరో ప్రయోగశాల కావొద్దు ఈ గడ్డ!!!
కత్తెరశాల కుమారస్వామి
సీనియర్ జర్నలిస్టు