- ప్రాణమైనా వొదులుకుంటా…పైసలివ్వలేను
- నన్ను చావనీయండి ప్లీజ్…యువ రైతు ఆవేదన
- టేక్మాల్‌లో తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యా యత్నం
- మొన్న శివ్వంపేట…నేడు టేక్మాల్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సొంత 6జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ పాలన గాడి తప్పింది. పైసలు చెల్లిస్తేనే ఫైల్ కదిలే పరిస్థితి నెలకొంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి వేధింపులు కొత్తేమీ కాదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ, కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల డబ్బుల కోసం వేధింపులు ఎక్కువవుతున్నాయి. వారి వేధింపులు తాళలేక కొంతర ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కూడా మన కళ్లముందే కదలాడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాఓని శివ్వంపేట తహశీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది వేధింపులు మరిచిపోక ముందే..తాజాగా టేక్మాల్లోనూ ఇలాంటి ఘటనే కలకలం రేపింది. వేధింపులు తాళలేక మరో రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ చిత్రంలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు..గొల్ల రమేష్. పాపాన్నపేట మండలంలోని సీతానగర్‌కు చెందిన గొల్ల రమేష్‌కు టేక్మాల్ మండలంలోని గొల్లగూడెం గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.
సదరు రైతు రమేష్ తన సొంత భూమిలో ఇంటి నిర్మాణం చేసుకుంటానంటే..రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమిని ఇంటి నిర్మాణం కోసం కన్వర్షన్ చేసేందుకు డబ్బులు డిమాండు చేశారు. వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేయాలంఏ డబ్బులు ఇస్తేనే చేస్తామనీ లేదంటే చేసే ప్రసక్తే లేదంటూ రెవెన్యూ అధికారులు రమేష్‌ను డబ్బుల కోసం వేధించసాగారు. అధికారుల లంచం ఇవ్వాలంటూ చేస్తున్న వొత్తిడి తట్టుకోలేక రమేష్ టేక్మాల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట భార్యతో కలిసి తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. రమేష్ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న విషయాన్ని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న వారు చూసి అడ్డుకున్నారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ…తన సొంత వ్యవసాయ భూమిలో సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటానంటే కన్వర్షన్ పేరుతో రెవెన్యూ అధికారులు డబ్బుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.
అయితే, రెవెన్యూ అధికారులు వొత్తిడి చేస్తున్నట్లు తాను డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేననీ అధికారులను ఎంతగా బతిమిలాడినా కనికరం చూపించలేదన్నారు. రెవెన్యూ అధికారుల వొత్తిళ్లు భరించలేక తహశీల్దార్ కార్యాలయం ఎదుటనే ఆత్మహత్య చేసుకుందామనీ పెట్రోలు పోసుకుని అంటించుకోపోయాననీ అన్నారు. తాను ప్రాణాలైనా తీసుకుంటాను. కానీ, అధికారులకు మాత్రం ఒక్క పైసా లంచంగా ఇవ్వననీ అన్నారు. లంచాలకు అలవాటు పడిన పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది వల్ల మొత్తం రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లంచాలకు అలవాటుపడిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి అధికారులు, సిబ్బంది విషయంలో సిఎం కేసీఆర్, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్ర తన్నీరు హరీష్‌రావు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరి!.