Take a fresh look at your lifestyle.

ఆగని పెట్రోల్ ధర పెరుగుదల

‌వాహనదారులపై పెట్రోల్‌ ‌ధరల బాధుడు కొనసాగుతోంది. పెట్రోల్‌ ‌ధరలు వరుసగా రెండో రోజు రేట్లు పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి రేట్లు చేరగా మరోసారి చమురు కంపెనీలు ధరలు పెంచాయి. దీంతో ఆల్‌ ‌టైం రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇవాళ లీటర్‌ ‌పై 30 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ ‌పెట్రోల్‌ 86 ‌రూపాయల 95 పైసలకు చేరింది.

డీజిల్‌ 77 ‌రూపాయల 13 పైసలకు చేరింది. అటు ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ ‌పెట్రోల్‌  93 ‌రూపాయల 49 పైసలకు చేరగా లీటర్‌ ‌డీజిల్‌ 83 ‌రూపాయల 99 పైసలుగా ఉంది.మరోవైపు చెన్నైలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 89.39 పైసలుండగా,.  డీజిల్‌ ‌ధర 82 రూపాయల 33 పైసలకు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ 90 ‌రూపాయల 42 పైసలుండగా డీజిల్‌ ‌ధర 84 రూపాయల 14 పైసలుగా ఉంది. అటువిశాఖ లో లీటర్‌ ‌పెట్రోల్‌ 92. 78 ‌పైసలుండగా డీజిల్‌ 85 ‌రూపాయల 99 పైసలుగా ఉంది.  కోల్‌ ‌కతాలో పెట్రోల్‌  88 ‌రూపాయల 30 పైసలకు చేరుకోగా  డీజిల్‌ 80 ‌రూపాయల 71 పైసలుగా ఉంది.

Leave a Reply