Take a fresh look at your lifestyle.

ఆగని పెట్రో మంట

  • 10 రోజుల్లో 9 సార్లు ధరల పెంపు
  • గురువారం లీటరు పెట్రోలు, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంపు
న్యూ దిల్లీ, మార్చి 31 : పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు గురువారం మరోసారి పెరిగాయి. బుధవారం నాటి ధరల కంటే గురువారం రోజు పెట్రోల్‌, ‌డీజిల్‌లపై లీటరుకు మరో 80 పైసలు పెరిగింది. ఇంధన ధరల్లో గురువారం మార్పుతో దిల్లీలో పెట్రోల్‌ ‌ధర లీటరుకు రూ.101.81కి చేరుకోగా, డీజిల్‌ ‌ధర పెరిగి లీటరుకు రూ. 93.07కు చేరుకుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 115.42 కాగా లీటరు డీజిల్‌ ‌ధర 101.58గా ఉంది.
2022 మార్చి 22వ తేదీ నుంచి 31 వరకు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు లీటరుపై రూ. 6.40 చొప్పున పెంచారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు చివరి సవరణ గత ఏడాది నవంబర్‌ 4‌వతేదీన జరిగింది. ఈ ఏడాది నవంబర్‌ 4‌వ తేదీ నుంచి గ్లోబల్‌ ‌మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి.  గ్లోబల్‌ ‌మార్కెట్లలో క్రూడాయిల్‌ ‌ధరలు భారీగా పెరిగాయి.రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం వల్ల భారతదేశంలో ప్రతీరోజూ పెట్రో ధరలు పెరుగుతుండటంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది.

Leave a Reply