Take a fresh look at your lifestyle.

పార్లమెంటులో ఆగని పెగాసస్‌ ‌ప్రకంపనలు

  • చర్చ చేయాల్సిందే అంటూ సభ్యుల పట్టు
  • విపక్ష సభ్యుల నినాదాల హోరుతో పలుమార్లు వాయిదా
  • లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌సభ్యుల తీరుపై మండిపడ్డ స్పీకర్‌
  • ‌పదిమంది సభ్యుల సస్పెన్షన్‌కు ఆదేశాలు

సోనియాతో మమతా బెనర్జీ భేటీ..పెగాసస్‌పై పోరాటానికి ముందుంటామని ప్రకటన
పెగాసస్‌తో ఫోన్‌ ‌హ్యాకింగ్‌ ‌వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేతబట్టి గట్టిగా నినాదాలు చేశారు. లోక్‌సభలో అయితే కాంగ్రెస్‌ ఎం‌పీలు పేపర్లు చించి స్పీకర్‌ ‌ఛైర్‌పైకి విసిరారు. దీంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్ల్లు వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్‌ ‌పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమే సభాపతి క్వశ్చన్‌ అవర్‌ ‌చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. కొందరు కాంగ్రెస్‌ ఎం‌పీలు పేపర్లు చించేసి స్పీకర్‌ ‌ఛైర్‌, ‌ట్రెజరీ బెంచ్‌లపైకి విసిరేశారు. దీంతో ఆగ్రహానికి గురైన సభాపతి సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా వేశారు. విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయక తప్పలేదు.

సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు, పేపర్లను చింపేసి స్పీకర్‌ ‌వైపు విసిరేసిన కాంగ్రెస్‌ ‌సభ్యులపై స్పీకర్‌ ఓం‌బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందర్నీ సస్పెండ్‌ ‌చేసేందుకు నోటీసులు జారీ చేశారు. వర్షాకాల సమావేశాలకు మొత్తానికీ సస్పెండ్‌ ‌చేస్తామని హెచ్చరించారు. విపక్ష సభ్యులెవరైనా… సభలో ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాలకు పాల్పడితే, వారిని కూడా సస్పెండ్‌ ‌చేస్తామని స్పీకర్‌ ‌తీవ్రంగా హెచ్చరించారు. సస్పెండ్‌ ‌చేసిన ఎంపీల జాబితాలో… మాణికం టాగూర్‌, ‌డీన్‌ ‌కురియకోసే, హిబీఈడెన్‌, ఎస్‌. ‌జ్యోయిమణి, రవ్‌నీత్‌ ‌బిట్టు, గుర్జీత్‌ అవుజా, టీఎన్‌ ‌ప్రతాపన్‌, ‌వైతిలింగమ్‌, ‌సప్తగిరి శంకర్‌, ఏఎమ్‌ ఆరిఫ్‌, ‌దీపక్‌ ‌బైజ్‌… ‌వీరందర్నీ సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు స్పీకర్‌ ఓం ‌బిర్లా పేర్కొన్నారు. పెగాసస్‌ ‌వ్యవహారంతో పాటు ఇతర వ్యవహారాలపై ప్రతిపక్ష పార్టీలు ఉదయం నుంచి సభలో నిరసనకు దిగారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ అదే గందరగోళం కన్పించింది. విపక్షాల నిరసనలతో ఉదయం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ 12 గంటలకు సభ మొదలవగా.. విపక్ష ఎంపీలు సీట్లలో నుంచి లేచి ఆందోళన చేపట్టారు. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను మళ్లీ వాయిదా వేయక తప్పలేదు.

సోనియాతో మమతా బెనర్జీ భేటీ..పెగాసస్‌పై పోరాటానికి ముందుంటామని ప్రకటన
కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం 10 జనపథ్‌కు వెళ్లి సోనియాతో ఆమె సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మూడవ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నది. ఈ నేపథ్యంలో సోనియాతో భేటీ సందర్భంగా మమతా బెనర్జీ ఈ అంశంపై ప్రధానంగా చర్చించవొచ్చని సమాచారం. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌సోనియా, రాహుల్‌తోపాటు ఎన్సీపీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించిట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరి కొందరు నేతలను కూడా మమతా బెనర్జీ కలవనున్నారు. ఇదిలావుంటే పెగాసస్‌ ‌వ్యవహారంపై పోరాడడానికి తమ పార్టీ ముందంజలో ఉంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే పెగాసస్‌ ‌వ్యవహారంపై ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి మమత డుమ్మా కొట్టారు.

ఈ విషయంపై ప్రశ్నించగా…పెగాసస్‌ ‌వ్యవహారంపై పోరాడడానికి తమ పార్టీ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. తన ఫోన్‌ ‌కూడా హ్యాక్‌ అయ్యిందని, అందుకే ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని అన్నారు. పెగాసస్‌ ‌జాబితాలో తన పేరు లేకపోయినా, తన ఫోన్‌ ‌హ్యాక్‌ అయ్యిందని ఆరోపించారు.‘నా ఫోన్‌ ‌హ్యాక్‌ అయ్యింది. అభిషేక్‌ ‌బెనర్జీ, ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌ఫోన్లు కూడా హ్యాక్‌ అయ్యాయి. ఒక్క ఫోన్‌ ‌హ్యాక్‌ అయ్యిందంటే చాలు.. అన్ని ఫోన్లూ హ్యాక్‌ అవుతాయి‘ అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కంటే పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉందని మండిపడ్డారు. పెగాసస్‌ ‌వ్యవహారంపై ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఈ వ్యవహారంపై అందరమూ కలుసుకుంటామని ప్రకటించారు. అయితే ప్రతిపక్ష కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారని ప్రశ్నించగా…. ‘నేనేవి• జ్యోతిషురాలిని కాదు.. ఎవరో ఒకరు తెరపైకి వస్తారు. వారికి నేను మద్దతిస్తాను‘ అని మమతా బెనర్జీ ప్రకటించారు.

Leave a Reply