Take a fresh look at your lifestyle.

దేశంలో ఆగని .. కొరోనా విజృంభణ

  • 8 లక్షలు దాటిన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ఢిల్లీలో గర్భస్థ శిశువుకూ కొరోనా

కొరోనా వైరస్‌ ‌రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల
చేసింది. దీని ప్రకారం..24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించగా 27,114 పాజిటివ్‌ ‌కేసులు నిర్ధారణయ్యాయి. 519 మంది వైరస్‌ ‌బారిన పడి మృతి చెందారు. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,20,916కు చేరింది. ప్రస్తుతం 2,83,407 మంది కొరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా.. 5,15,385 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 22,123 మంది కొరోనాతో బాధపడుతూ మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా పరీక్షలు నిర్వహించారు.

గర్భస్థ శివువుకూ కొరోనా
తల్లి గర్భంలోనే శిశువుకు కొరోనా సోకింది. ఆ గర్భిణికి మొదట వైరస్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చింది. కానీ డెలివరీ మాత్రం నెగిటివ్‌ ‌ఫలితం వచ్చాకే అయింది. పుట్టిన ఆరు గంటల తర్వాత బిడ్డకు కొరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ ‌ఫలితం వచ్చింది. ఇలాంటి కేసు దేశంలోనే మొదటిసారి అని ఢిల్లీలోని రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నంగ్లోయికి చెందిన 25 ఏళ్ల మహిళ గర్భిణి. ఆమెకు జూన్‌ 11‌న కొరోనా పాజిటివ్‌ ‌నిర్ధారణ అయింది. భర్త కూడా కరోనా రావడంతో చికిత్స పొందుతున్నాడు. రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గర్భిణికి జూన్‌ 25‌న మళ్లీ కొరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితం పాజిటివ్‌ ‌వచ్చింది. మళ్లీ జులై 7వ తేదీన ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ మరుసటి రోజే పండంటి బిడ్డకు గర్భిణి జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన ఆరు గంటల తర్వాత.. చిన్నారి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ ‌నిర్ధారణ అయింది. చిన్నారికి కొరోనా ఇన్‌ ‌ఫెక్షన్‌ అధికంగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డకు కొరోనా వ్యాపించే అవకాశం ఉందని రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

error: Content is protected !!