Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఆగని కొరోనా ఉధృతి

24 గంటల్లో కొత్తగా 4,446 మందికి పాజిటివ్‌

మహారాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలపై నిఘా : కామారెడ్డిలో జిల్లా అధికారులతో సవి•క్షలో మంత్రి వేముల
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌రోజురోజుకూ మరింత ఉధృతమవుతున్నది. ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4446 కొరోనా కేసులు నమోదవగా మరో 12 మంది బాధితులు మరణించారు. 1414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3.46 లక్షలకు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైరస్‌వల్ల మరణించగా, మరో 3.11 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 22,118 మంది బాధితులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ ‌కేసుల్లో జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 598, రంగారెడ్డి జిల్లాలో 326, నిజామాబాద్‌లో 314 చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం 1,26,235 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కొత్తగా 598 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ‌బులిటెన్‌లో పేర్కొంది.

Leave a Reply