Take a fresh look at your lifestyle.

పొంతన లేని లెక్కలు ..పతనమయిన వ్యవస్థలు

‘‌కేబినెట్‌ ‌వ్యవస్థ పతనం అయింది. సంయుక్త బాధ్యత అనేది కరవైంది ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. కొరోనా వచ్చిన తర్వాత ఆయన పేరు కూడా   తక్కువగానే వినిపిస్తోంది.  కేబినెట్‌ ‌వ్యవస్థ పతనం అయింది.  ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణం చేసిన నాటి నుంచి   సమష్టి నిర్ణయాలనేవి లేనే లేవు. 2016 నవంబర్‌ ‌లో పెద్దనోట్ల రద్దు, జిఎస్‌ ‌టీ మొదలైన అన్ని నిర్ణయాలూ   ప్రధాని నోటంట వెలువ డినవే. ఇందిరాగాంధీ కేబినెట్‌ ‌లో మాదిరిగా అసమ్మతి తెలియజేశే అవకాశం ఎవరికీ రావడం లేదు…’

ప్రధానమంత్రి… ముఖ్యమంత్రి…. జిల్లా మేజస్ట్రేట్‌ ‌లు ప్రభుత్వ రథాన్ని మూడు స్థాయిల్లో నడిపించే శక్తులు.కానీ ఈ మూడు శక్తులు కొరోనా విషయంలో ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాయి. తెలివైన ప్రభుత్వాధికారి ప్రభుత్వాన్ని నడిపించేందుకు మంచి అవకాశాలను కలిగి ఉంటాడు.పాలనా యంత్రాంగం ఈ మూడు శక్తుల మీద ఆధారపడి నడుస్తుందని ఒక అధికారి అన్నారు. కానీ, కొరోనా సమయంలో ఈ పరంపర లోని వారికి స్వతంత్రంగా నిర్ణయాలు, పనులు చేపట్టే అధికారం లేదు.విపత్తు నివారణ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రభుత్వంలో ప్రత్యేక శాఖ ఉంది. ఇందుకు సంబందించిన చట్టాన్ని అమలు జేయడమే ఆ శాఖాధికారుల బాధ్యత, కానీ ఎన్నడూ లేని విధంగా కొరోనా వ్యాప్తి కారణంగా విధించిన ఆరోగ్య ఎమర్జెన్సీ కాలంలో ఈ మూడు శక్తులు సమన్వయంతో సవ్యంగా పని చేయలేదు. ఎవరికి తోచిన విధంగా వారు పని చేసుకుంటూ పోతున్నారు. విపత్తు నివారణ చట్టం ఇంత దారుణంగా ఎన్నడూ అమలు జరగలేదు. ముఖ్యంగా, కొరోనా సమయంలో వీధుల పాలైన అసంఘటిత రంగం కార్మికులను (వలస కార్మికులను) స్వస్థలాలకు పంపడంలో పై నుంచి కిందవరకూ ఈ మూడు శక్తులు విఫలమయ్యాయి.

ఈ మూడు శక్తులు 2014 వేసవి తర్వాత బలాన్ని పుంజుకున్నాయి. 1996-2014 మధ్య సంకీర్ణ యుగం నడిచింది.ఏ మంత్రి గురించి గట్టిగా వినిపించలేదు. ఇప్పుడు కూడా అమిత్‌ ‌షా పేరు తప్ప ఎక్కడా ఎవరి పేరు వినిపించడం లేదు.కేబినెట్‌ ‌వ్యవస్థ పతనం అయింది. సంయుక్త బాధ్యత అనేది కరవైంది ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. కొరోనా వచ్చిన తర్వాత ఆయన పేరు కూడా తక్కువగానే వినిపిస్తోంది. కేబినెట్‌ ‌వ్యవస్థ పతనం అయింది. ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణం చేసిన నాటి నుంచి సమష్టి నిర్ణయాలనేవి లేనే లేవు.2016 నవంబర్‌లోపెద్దనోట్ల రద్దు, జిఎస్‌ ‌టీ మొదలైన అన్ని నిర్ణయాలూ ప్రధాని నోటంట వెలువ డినవే. ఇందిరాగాంధీ కేబినెట్‌ ‌లో మాదిరిగా అసమ్మతి తెలియజేశే అవకాశం ఎవరికీ రావడం లేదు.

2004 -2014 మధ్య కాలంలో రాష్ట్రాల్లో రాజశేఖరరెడ్డి (ఆంధ్రప్రదేశ్‌), ‌మోడీ (గుజరాత్‌), ‌జయలలిత (తమిళనాడు) వంటి శక్తిమంతమైన ముఖ్యమంత్రులు ఉండేవారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిస్ట్రిక్ట్ ‌మేజస్ట్రేట్‌ ‌పదవులలో ఉన్న వారే ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నారు. 1897 నాటి అంటువ్యాధుల నిరోధక చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఉపయోగి ంచింది.అలాగే, విపత్త నివారణ చట్టాన్ని వినియోగించింది. ఈ చట్టాలతో కేంద్రం అన్ని అధికారాలను కేంద్రీకృతం చేసుకుంది. ప్రధానమంత్రి మోడీ ఇతర ప్రతిపక్ష నాయకులతో మాట్లాడకుండా కేవలం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌లు తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రైతులు ఒకటి రెండు రాష్ట్రాల్లోనే నష్టపోయారని అనుకుంటున్నారు. కానీ, అన్ని రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి సజావుగా లేదు. 2004లో సునామీ సంభవించినప్పుడు విపత్తు నివారణ చట్టం ఆమోదం పొందింది. ఆనాటి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. కేబినెట్‌ ‌సెక్రటరీ, హోం శాఖ కార్యదర్సి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ‌లు నిర్వహిస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయాలు ప్రజలతో ప్రమేయం లేనివి. కొరోనావ్యాధి గ్రస్తుల సంఖ్య, మృతుల సంఖ్యలతో పొంతన లేదు. కోన్ని రాష్ట్రాలు తమకు తోచిన విధంగా పరీక్షలు, లెక్కలు తేలుస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ పశ్చిమ బెంగాల్‌, ‌తెలంగాణలే. మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రుల దారులు వేరు ,. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌ ‌లు తమ దారుల్లో తాము పయనిస్తున్నారు. వీరిచ్చే లెక్కలకు పొంతన లేదు. జిల్లా స్థాయిల్లో జిల్లా మేజస్ట్రేట్లు అదే తీరులో తమ దారిలో తాము వ్యవ హరిస్తున్నారు.నిజానికి వీరంతా ఉత్స వ విగ్రహాలే. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ‌ల్లో ఇచ్చే ఆదేశాలే ఫైనల్‌. ‌కేంద్రంలో వ్యవసాయ, ఆరోగ్య, తదితర శాఖల మంత్రులు నామ మాత్రులు. వలస కార్మికుల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్రాలు విపలమవుతున్నాయి. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు పేలవంగా ఉంటున్నాయి. పైగా తగినన్ని నిధులు లేకపోవడం వల్ల ఇవి సరైన రీతిలో స్పందించలేకపోతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌,‌కర్నాటక, పంజాబ్‌, ‌ఢిల్లీ ల నుంచే వలస కార్మికులు ఎక్కువగా వస్తుంటారు.

ఐఏఎస్‌ అధికారులు కమిషనర్లుగా ఉన్న
కార్పొరేషన్లలో కొరోనా పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నందున మహారాష్ట్ర, గుజరాత్‌ ‌లలో కార్పొరేషన్‌ ‌కమిషనర్‌ ‌పదవుల నుంచి వారిని తప్పించారు. మధ్యప్రదేశ్‌ ‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శనీ, కమిషనర్‌ ‌నీ మార్చివేశారు. పరిపాలనలో మూడు శక్తులు కూడా నియంతృత్వ ధోరణిలోనే వ్యవహరిస్తున్నాయి.

తెలంగాణా లో తక్కువ పరీక్షలు
లాక్‌ ‌డౌన్‌ ‌లో పొరపాట్లపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం…. తెలంగాణలో కొరోనా పరీక్షలపై అవసరం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్‌ ) ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలపై ముసురుకున్న వివాదాల పైనా తెలంగాణలో కొరోనా పరీక్షలు తక్కువగా ఉండటంపైనా అధ్యయనం చేస్తే తేలిన వివరాలు ఇవి. ఈ అధ్యయనాన్ని లండన్‌ ‌లోని ఇంపీరియల్‌ ‌కాలేజీలో సుప్రసిద్ధ అంటువ్యాధుల నిపునుడు నీల్‌ ‌ఫెర్గ్యూసన్‌ ‌నిర్వహించారు. లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించకపోయి ఉంటే అమెరికాలో మొత్తం 2.2 మిలియన్‌ ‌మంది ప్రజలు మరణించి ఉండేవారని ఆయన తేల్చారు. అంటే మొత్తం జనాభాలో 0.9 శాతం అన్న మాట అలాగే, కొరోనా పరీక్షల విషయంలో వివిధ దేశాలు చురుకుగా వ్యవహరించి ఉండకపోతే ప్రపంచ వ్యాప్తంగా 90 మిలియన్‌ ‌మందికి ఈ వ్యాధి సోకి మరణించి ఉండేవారని స్పష్టం చేశారు ఒక్క యూకే లోనే 5,10,000 మంది మరణించి ఉండేవారని పేర్కొన్నారు. కొరోనా పరీక్షలు నిర్వహించడం, కొరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిన వారిని ఐసోలేషన్‌ ‌లో ఉంచడం, పాఠశాలలు, విద్యా సంస్థల ను మూసివేయడం వల్ల కొరోనా వ్యాప్తి తగ్గింది. రోగ నిరోధక శక్తి వల్ల కొరోనా వ్యాపించదని యూకె ప్రభుత్వం వాదించినా అక్కడ కూడా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఎక్కువ మంది మరణించారు.

బ్రిటిష్‌ ‌ప్రదాని బోరిస్‌ ‌జాన్సన్‌ ‌కూడా కొరోనా ప్రభావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు., అయితే కొరోనా వైరస్‌ ‌సోకిన వారికి అందించే చికిత్సలో 1970లో రూపొందించిన అంటురోగాల నివారణ ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే లాక్‌ ‌డౌన్‌ ‌పాటించినా కొరోనా వ్యాప్తి అదుపులోకి రావడం లేదని వైద్య శాస్త్ర నిపుణులు వాన్డిస్కో, బౌండిక్‌ ‌వంటి వారు తమ వ్యాసాల్లో పేర్కొన్నారు. ఐసి ఎంఆర్‌ ( ‌భారత వైద్య పరిశోధనా మండలి) ఈ ప్రమాణాలను సవరించింది. అయితే, ఇవి కూడా ఆనాటి ప్రమాణాలకు తగినట్టుగా లేవు.భారత దేశంలో కొరోనా టెస్టింగ్‌ ‌కిట్లు చాలినన్ని లేకపోవడం, చేసిన పరీక్షల్లో కూడా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వ్యాది అదుపులోకి రావడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణలో కొరోనా పరీక్షలు జాతీయ సగటు కన్నా బాగా తక్కువగా ఉన్నాయి. పరీక్షలు తక్కువగా ఉన్నాయని ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావుతో ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు. అయితే, రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాత్రం తాము ఐసిఎంఆర్‌ ‌మార్గదర్సకాలను పాటిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ‌లో రోజుకు 9,000 పరీక్షలు జరుగుతుండగా, తెలంగాణలో 200 మాత్రమే జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో మిలియన్‌ ‌జనాభాకు సగటున 1,025 పరీక్షలు జరుగుతున్నాయి.
-శేఖర్‌ ‌గుప్తా ,’ది ప్రింట్‌ ‘‌సౌజన్యం తో ..

Leave a Reply