Take a fresh look at your lifestyle.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతున్నాయి

ఎలాంటి గందరగోళం లేదు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌ప్రకటన

తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‌తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వొస్తోందన్నారు. వారిలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. స్లాట్‌ ‌బుకింగ్‌ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు వొస్తున్నారని అన్నారు. ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రంలో 2,427 లావాదేవీలు జరగ్గా వీటి ద్వారా ప్రభుత్వానికి 43.62 కోట్ల రూపాయల ఆదాయం వొచ్చిందన్నారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన మొదటి రోజే 82 మంది చేయించుకున్నారని తెలిపారు. ఈనెల 15వ తేదీన 140 లావాదేవీలు జరిగాయన్నారు.

రాష్ట్రంలోని 92 సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాల్లో బుధవారానికి 433 స్లాట్స్ ‌బుక్‌ అయినట్టు చెప్పారు. ఆన్‌లైన్‌ ‌ద్వారా కూడా స్లాట్‌ ‌ముకింగ్‌ ‌సౌకర్యాన్ని కల్పించామన్నారు. అలాగే సేవా కేంద్రాల్లోనూ స్లాట్‌ ‌బుక్‌చేసుకునే అవకాశం ఉందని సీఎస్‌ ‌తెలిపారు. ధరణి అగ్రికల్చర్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా కూడా స్లాట్‌ ‌బుక్‌ ‌చేసుకోవొచ్చన్నారు. ఇప్పటి వరకూ 80,947 లావాదేవీల ద్వారా 59,294 రిజిస్ట్రేషన్‌లు పూర్తిచేయడం ద్వారా 87.02 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం సాధించిందన్నారు. బుధవారం నుంచి అగ్రికల్చర్‌ ‌ల్యాండ్‌ ‌నుంచి నాన్‌ అ‌గ్రికల్చర్‌ ‌ల్యాండ్‌ ‌సౌకర్యం కూడా ఆన్‌లైన్‌ ‌ద్వారా సేవలు పొందేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకు వొచ్చామన్నారు.

Leave a Reply