Take a fresh look at your lifestyle.

నిర్దేశించిన గడువులోగా నామినేషన్లు స్వీకరించాలి: ఎన్నికల అధికారి

Nominations must be received within the prescribed deadline Election Officerవనపర్తి: నిర్దేశించిన సమయం ప్రకారం నామినేషన్‌లను స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ ‌జిల్లాఎన్నికల అధికారి శ్వేతామహంతి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు సందర్భంగా కలెక్టర్‌ ‌వనపర్తి మున్సిపాలిటిలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ ‌కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. చివరిరోజు నామినేషన్లు వేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను వివిధ రకాల ఫారాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టర్‌ ‌మాట్లాడుతు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశించిన సమయం 5గంటల లోపు నామినేషన్లు స్వీకరించాలని, సాయంత్రం ఐదు తర్వాత ఏలాంటి నామినేషన్లు స్వీకరించవద్దని, 5గంటల తర్వాత నామినేషన్‌ ‌గదిలోకి ఎవరిని అనుమతించవద్దని ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు క్యూలో ఉన్నట్లయితే వారికి ముందుగానే టోకన్లు జారీ చేయాలని సూచించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత గేట్లు మూసివేయాలని ఆదేశించారు. చివరి రోజు నామినేషన్ల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని అంతేకాక నామినేషన్‌ ‌కేంద్రంలో అవసరమైన ఏర్పాటు కూడా చూసుకోవాలని మున్సిపల్‌ ‌కమీషనర్‌ ‌రజనీకాంత్‌ ‌రెడ్డి ని ఆదేశించారు. కలెక్టర్‌ ‌వెంట డిసిఓ కోదండరాం తదితురులు ఉన్నారు.

Tags: Nominations, prescribed deadline, Election Officer, vanaparthy, district collector

Leave a Reply