Take a fresh look at your lifestyle.

గురువారం స్వగ్రామం పాలెంలో నోముల అంత్యక్రియలు

హాజరు కానున్న సిఎం కెసిఆర్‌, ‌మంత్రులు

మంగళవారం అనారోగ్యంతో మృతి చెందిన టిఆర్‌ఎస్‌ ‌నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్రయక్రియులు గురువారం నిర్వహించనున్నారు. ఆయన స్వగ్రామం నకిరేకల్‌ ‌మండలం పాలెంలో జరిగే అంత్యక్రియల్లో సిఎం కేసీఆర్‌ ‌పాల్గొననున్నారు.
ఆయనతోపాటు జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేదర్‌ ‌రెడ్డి తదితరులు కూడా హాజరు కానున్నారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లో ఉన్నారు. పాలెం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Reply