Take a fresh look at your lifestyle.

పెట్రోల్..డీజిల్ పన్నులను తగ్గించేది లేదు..!

వాటిని అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు చేస్తున్నాం: కేంద్రం
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ ,జూలై 28 : పెట్రోల్ మరియు డీజిల్ పన్నులను తగ్గించమని సామాన్య ప్రజలు,ప్రజా సంస్థల నుంచి అనేక విజ్ఞప్తులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇంధనంపై పన్నులను తగ్గించలేదు ఎందుకు ..? అని టీడీపీ ఎంపీ కనకమేడల కేంద్రాన్ని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా బాధపడుతున్న ప్రజలకు పెద్ద మొత్తంలో ఉపశమనం కలిగించడానికి పెట్రోల్ మరియు డీజిల్ పన్నులను ప్రభుత్వం తగ్గిస్తుందా లేదా అని ప్రశ్నించటంతో పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వక సమాధానం ఆశ్చర్యపోయే రీతిలో ఇచ్చింది. పెట్రోల్..డీజిల్ పన్నులను అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు చేస్తున్నాం కనుక పెట్రోల్..డీజిల్ పన్నులను తగ్గించలేం అని ఖరాకండిగా చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి.ఎక్సైజ్ సుంకం / సెస్‌ను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం / సెస్ రేట్లు ప్రస్తుత ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని విధిస్తున్నాం.

మౌలిక సదుపాయాలు మరియు ఇతర అభివృద్ధి అంశాల వనరులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన మేరకు కేంద్రం ఈ పన్నును వసూలు చేస్తున్నది. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని,ప్రభుత్వం వివిధ అభివృద్ధి పథకాలలు అయిన ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పిఎమ్‌జిఎస్‌వై), ప్రధాన్ మంత్రి ఉజ్జవాలా యోజన (పిఎంయువై), ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) మరియు ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ అన్నా యోజన (పిఎంజికె) వంటి పథకాల నిర్వహణ కోసం వాడింది. ఈ పధకాలు మహమ్మారి కొరోనా సమయంలో పేదలకు ఉపశమనం కలిగించాయి. ఏప్రిల్, 2020 నుండి నవంబర్ 2020 మరియు మే-జూన్ 2021 లలో 80 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ అందించబడింది. కోవిడ్ -19 కి ఉచిత టీకాలు వేయడం. గత 7 సంవత్సరాల్లో, జాతీయ రహదారుల పొడవు 91,287 కిమీ నుండి 50% పెరిగింది.ఏప్రిల్ 2014 నుండి 20 మార్చి 2021 నాటికి మరో 1,37,625 కి.మీ వరకు రహదారుల నిర్మాణం కేంద్రం చేయనుంది. వీటికోసం నిధులుగా పెట్రోల్..డీజిల్ పన్నులను వసూలు చేస్తున్నాం అని కేంద్రం తేల్చి చెప్పింది.పెట్రోల్ డీజల్ సెస్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించబడుతుంది మరియు ఉపాధిని కూడా సృష్టిస్తుంది. కనుక తగ్గించలేం అని తేల్చి చెప్పింది కేంద్రం.

Leave a Reply