Take a fresh look at your lifestyle.

సిద్దిపేట రైతు బజార్ లో ప్లాస్టిక్ రహిత భోజనం..!

వేసవి కాలంలో పంటలు తక్కువగా వస్తున్నది.! కానీ ధర అధికంగా ఉంటుంది.! ఏ సమయంలో ఏ పంటలు పండించాలో.. ఆ పంటలకు సరైనా ఆ గిట్టుబాటు ధరను బట్టి ఆ పంటలే పండించాలని అప్పుడే రైతు రాజుగా మారుతాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలోని రైతుబజారులో మంగళవారం ఉదయం రైతుబజారులో హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత భోజనం ప్లాస్టిక్ ప్లేట్స్ వాడకుండా స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసులతో రూ.5కే భోజనామృతం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ విషయమై రైతుబజారులో కూరగాయలు విక్రయించే మహిళా రైతులతో కాసేపు గిట్టుబాటు ధర వస్తుందా..? అంటూ మంత్రి ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

ఈ మేరకు టమాటా రైతులకు అండగా ఉండాలని మంత్రి ని టమాట రైతులు కోరగా.., శీతాకాలంలో పండే పంట కాబట్టి టమాట పంట వేసవికాలంలో తక్కువగా పండుతున్న దృష్ట్యా టమాట పంటకు షెడ్డు వేసుకోవాలని, ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తున్నామని టమాట  రైతులకు అండగా ఉంటామని మంత్రి  భరోసా ఇచ్చారు. అంతకు ముందు రైతుబజారు పరిశుభ్రంగా నిలపాలని మంత్రి  చేతుల మీదుగా బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, ఎఫ్టీసీసీఐ ప్రతినిధులు కరునేంద్ర జాస్త్రీ, క్యేతి నర్వరీ, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply