- చంద్రబాబు భాష మార్చుకుంటే మంచిది
- టిడిపిని ప్రజలు నమ్మడం లేదని తెలిపోయింది: శ్రీకాంత్ రెడ్డి
ఎంపీటీసీ, జడ్పీటీసీల ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం వి•డియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు, కక్ష లేదని పేర్కొన్నారు. అమరావతి అసైన్డ్ భూ వ్యవహారంలో చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అమరావతి సహా రాష్ట్రంలోని అన్నిప్రాంతాలను సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు. టీడీపీని ప్రజలు నమ్మలేదు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని అన్నారు.
చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని పేర్కొన్నారు.. సీఎం జగన్ ను నమ్మి ప్రజలు వైసీపీకి ఓట్లేశారని, ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టిన టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. చంద్రబాబు తన భాషను మార్చుకోవాలని అన్నారు. చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడంపై కోర్టులను అవమానపరిచేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు దమ్ముంటే కోర్టుల్లో స్టేలు వేకెట్ చేయించుకోవాలని అన్నారు. అలానే వచ్చిన ఆరోపణలపై విచారణకు ఒప్పుకోవాలని అన్నారు. చంద్రబాబు, లోకేష్ తీరుతో ప్రజలు విసుగు చెందారని చంద్రబాబు తన హయాంలో అన్ని పేర్లతో దోచుకున్నారని అన్నారు. ప్రజల్లో చంద్రబాబు, జగన్ ఫోటోలు పెట్టి అభిప్రాయం అడిగితే 99 శాతం ఆదరణ జగన్ కు వస్తుందని అన్నారు.
అలా జరగక పోతే నేను దేనికైనా సిద్దపడతానని అన్నారు. ఈవీఎంలను దొంగతనం చేసిన చరిత్ర టీడీపీదన్న ఆయన అమరావతి ప్రాధాన్యత తగ్గించాలని సీఎం జగన్ ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని అన్నారు. అమరావతి సహా అన్ని ప్రాంతాలను సీఎం అభివృద్ధి చేస్తారన్న ఆయన ప్రాంతాల వారీగా చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల్లో వైసీపీ వి•ద నమ్మకమే గెలిపించిందని అన్నారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలిపారని, కర్నూలులో న్యాయ రాజధాని పెడతాంటే నాలుగు జిరాక్స్ షాపులు కూడా రావని చంద్రబాబు అవమానించారని అన్నారు. ప్రజలను చంద్రబాబు మోసం చేశారనే విషయం తెలిసిపోయిందని అందుకే టీడీపీ పూర్తిగా క్లోజ్ అయిపోయిందని అన్నారు.
పార్టీని, రాజకీయాలను చంద్రబాబు వదిలివేయాలని ఇప్పటికైనా చంద్రబాబు మారాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాలు పలు కంపెనీలు సీఎం జగన్ తీసుకు వస్తారని, సుపరిపాలనను సీఎం జగన్ కొనసాగిస్తారని అన్నారు. వరుసగా ఎన్నికలు తీసుకోవడంతో శాసనసభను జరపలేకపోయామని శాసన సభను నిర్వహించే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ వైఖరి తెలియజేయాల్సి ఉందని అన్నారు. శాసన సభ నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.