Take a fresh look at your lifestyle.

ఆం‌దోళన అవసరం లేదు… జాగ్రత్తలు పాటించాలి

  • కొరోనా కొత్త వేరియంట్‌ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధం
  • విమానాశ్రయంలో స్క్రీనింగ్‌, ఆర్టీపిసిఆర్‌ ‌పరీక్షలు నిర్వహిస్తున్నాం
  • ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాసరావు
  • ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష

కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, కోవిడ్‌ ‌జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్‌, ‌ప్రభుత్వ సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం డీహెచ్‌ శ్రీ‌నివాసరావు మాట్లాడుతూ కొరోనా కొత్త వేరియంట్‌ ‌పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందనీ, ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదలను గమనించలేదనీ, కొత్త వేరియంట్‌ ‌రాష్ట్రంలో ప్రవేశించకుండా విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ ‌పెంచామనీ, అక్కడే ఆర్టీపీసిఆర్‌ ‌పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వొచ్చిన ప్రయాణికులు 14 రోజలు పాటు హోమ్‌ ‌క్వారంటైన్‌ ఉం‌డేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆరోగ్యాన్ని కూడా మానిటర్‌ ‌చేస్తున్నామన్నారు. మూడే వేవ్‌ ‌విషయంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామనీ, ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

 

రాష్ట్రంలో థర్డ్ ‌వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 60099 బెడ్స్ ‌సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పరంగా ప్రజారోగ్య శాఖ హాస్పిటల్స్‌లో 27966 బెడ్స్ అం‌దుబాటులో ఉన్నాయని తెలిపారు. థర్డ్ ‌వేవ్‌ ‌చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని వార్తలు వొస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా బెడ్స్‌ను సిద్ధంగా ఉంచామని చెప్పారు. అలాగే, ఎక్కడా ఆక్సీజన్‌కు కొరత లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఆక్సీజన్‌ ‌బెడ్స్‌ను కూడా భారీ సంఖ్యలో పెంచడం జరిగిందన్నారు. నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో 100 నుంచి 150 కేసులు మాత్రమే నమోదవుతున్నాయనీ, 90 శాతం మంది మొదటి డోసు, 45 శాతం మంది రెండో డోసు తీసుకున్నారని చెప్పారు. అయితే, వ్యవధి గడచినా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదని, కొరోనా కేసులు తగ్గడంతో పాటు టీకాలు, నిబంధనల పట్ల నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించామని పేర్కొన్నారు.

 

ఏ వేరియంట్‌ ‌వొచ్చినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉందనీ, మాస్క్ ‌ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. రెండు డోసుల టీకా తప్పనిసరిగా తీసుకోవాలనీ, ప్రభుత్వం వద్ద అర్హులైన వారికి వేయడానికి అవసరమైన డోసులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. డీఎంఈ డా.రమేశ్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదనీ, ప్రజలు బాధ్యతగా టీకా వేసుకోవాలని సూచించారు. వైరస్‌ ఉత్పరివర్తనాలు జరుగుతాయనీ, కొత్త రకం వేరియంట్‌ ఎం‌తవరకు ప్రమాదకరం అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా రమేశ్‌ ‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply