బ్రిటన్‌లో కొత్త తరహా స్ట్రెయిన్ వైరస్ పట్ల.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్
విమానరాకపోకలను నిషేధించిన కేంద్రం
బ్రిటన్‌లో కొత్త స్టెయ్రిన్ వైరస్ తీవ్రంగా కలవరపెడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని భరోసా కల్పించారు. అయితే బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలను మంగళవారం నుంచి
నిసేధించింది. బ్రిటన్ లో వచ్చిన కొత్త స్టెయ్రిన్ వైరస్‌పై ప్రభుత్వం అలర్ట్‌గా ఉందని హర్షవర్ధన్ ప్రకటించారు. ఈ సమయంలో ఊహలు, ఆలోచనలు, భయాందోళనలు పడకండి. ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది. గత సంవత్సరం నుంచి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, శ్రేయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే ఉన్నాం. నన్ను అడిగితే మాత్రం… భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేనేలేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. •రిళిజుకు దాదాపు 1100 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారి పీడ విరగడైందని బ్రిటన్‌వాసులు కుదుటపడేలోపే.. ఆ వైరస్ కొత్తగా కొమ్ములు, కోరలు తొడుక్కుని మరోమారు విరుచుకుపడుతోంది! వైరస్ దెబ్బకు ఇప్పటికే రెండుసార్లు అల్లాడిపోయిన బ్రిటన్‌ను ఈ కొత్త స్టెయ్రిన్ తీవ్రంగా కలవర పెడుతోంది.

ఈ ఏడాది మొదట్లో వ్యాప్తిచెందిన రకంతో పోలిస్తే.. 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉత్తర ఐర్లండ్ మినహా యూకే మొత్తం ఈ కొత్త స్టెయ్రిన్ వ్యాపించింది. దీని గుర్తింపు కూడా క్లిష్టంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఈ కొత్త స్టెయ్రిన్‌కు బ్రిటన్ శాస్త్రవేత్తలు ’వీయూఐ 202012/01’గా పేరు పెట్టారు. వాస్తవానికి కొన్ని రోజులుగా బ్రిటన్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో విస్తరిస్తున్న కొత్త కరోనా వైరస్‌పై కేంద్రం అప్రమత్తంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బ్రిటన్‌లో కొత్త వైరస్‌ను గుర్తించడంతో పాటు అతి వేగంగా వ్యాప్తి చెందుతుందని వచ్చిన అంచనాల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో కెనడా, సౌదీ అరేబియాతో పాటు పలు యూరోపియన్ యూనియన్ దేశాలు విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. దీనిపై హర్షవర్థన్ స్పందింస్తూ.. ఊహాత్మక పరిస్థితులు, ఊహాజనిత చర్చలు, ఊహాత్మక భయాందోళనలతో ఇబ్బంది పడొద్దని, కేంద్రం అప్రమత్తంగా ఉందని, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇండియా సైన్స్ ఫెస్టివల్స్ కార్యక్రమంలో తెలిపారు. విమాన రాకపోకలపై నిర్ణయం గురించి ప్రశ్నించగా… అంతగా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆయన ఈ వివరణ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న బ్రిటన్‌లో కొత్త వైరస్ విజృంభించిందని, యుకెకు అన్ని విమాన రాకపోకలపై తక్షణమే నిషేధం విధించాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కొత్త రకం వైరస్…అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
విదేశాల నుంచి వొచ్చిన ప్రయాణికుల ట్రాకింగ్•
విదేశాల నుంచి వొచ్చిన ప్రయాణికుల ట్రాకింగ్•
కొరోనా వైరస్ నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వేళ బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఇప్పటికే భారత ప్రభుత్వం అప్రమత్తమై యూకే దేశాల నుంచి రానున్న విమానాలను నిలిపివేసింది. మంగళవారం నుంచి ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలు పూర్తిగా నిలచిపోనున్నాయి. కొత్త రకం కొరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వారం రోజుల కిందటి నుంచి విదేశాల నుంచి ముఖ్యంగా బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను ట్రాక్ చేయాలని రాష్ట్ర వైద్య శాఖ నిర్ణయించింది. దీంతో పాటు శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా ఏర్పాటు చేసి ఆయా దేశాల నుంచి ప్రయాణికులు వచ్చిన వెంటనే ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేయనున్నారు. పాజిటివ్‌గా వచ్చిన వాళ్లను హాస్పిటల్స్‌కు తరలించనుండగా, నెగిటివ్ వచ్చినా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.