Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ) లేనట్లే ..! 

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)  పెట్టడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.  2014 ఫిబ్రవరిలో కేంద్ర క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్(అమరావతి), అస్సాం(జోర్హట్), మధ్య ప్రదేశ్(భోపాల్), హర్యానా(కురుక్షేత్ర)లో కొత్త ఎన్ఐడిలు ఏర్పాటు చేసిన కేంద్రం తెలంగాణలో ఎన్ఐడీని ఇంకా స్థాపించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రానికి విజ్ఞప్తి పంపిందా? అని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఎన్ఐడీ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారని, సంబంధిత శాఖకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వినతి పత్రాలు అందాయని తెలిపారు.  భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో నాణ్యమైన విద్యను వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో అహ్మదాబాద్ తరహాలో నాలుగు ఎన్ఐడిలను ఏర్పాటు చేయాలని కేంద్ర భావించిందని, ఆ నాలుగు కేంద్రాల్లో ఎన్ఐడిలను ఏర్పాటు చేసినట్లు అక్కడ విద్యా సంవత్సరాలు కొనసాగుతున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్పష్టం చేశారు. అయితే, కొత్త వాటికి స్థాపించే ఆలోచన కేంద్ర ప్రభుత్వంకి లేదని స్పష్టం కూడా కుండ బద్దలు కొట్టారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఎన్ఐడీని పెట్టమని కేంద్రానికి చేసుకున్న విన్నపం బుట్టదాఖలు అయినట్లే..

Leave a Reply

error: Content is protected !!